ఇది వరకు కామెడీ చేస్తే నరేషే చేయాలి అనేలా ఉండేది. సినిమా అన్నీ జోకులే. అవన్నీ టీవీలోనూ మళ్లీ మళ్లీ చూసుకొని మనసారా నవ్వుకొనేవాళ్లు. అందుకే నరేష్ సినిమా వస్తోందంటే నవ్వు కోవడానికి రెడీ అయిపోయేవారంతా. శాటిలైట్ హక్కులకూ మంచి గిరాకీ ఉండేది. కానీ.. గత కొంత కాలంగా నరేష్ సినిమాలన్నీ తుస్సు మంటున్నాయి. నవ్వించడానికి నరేష్ తోపాటు మిగిలిన హీరోలూ పోటీకొచ్చేస్తున్నారు. నాని నుంచి శర్వానంద్ వరకూ… మహేష్ నుంచి సంపూర్ణేష్ వరకూ అందరిదీ కామెడీ బాటే. నరేష్ దగ్గర కొత్త నవ్వులు మిస్సయి.. కొత్తవాళ్లే పాత జోకులు చెబుతుంటే.. అదే వాళ్లకు ప్లస్సయి.. చివరికి నరేష్ కెరీర్ మైనస్ లోకి వెళ్లిపోయింది.
నరేష్.. ఇక మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈసారైనా హిట్టుకొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు సెల్ఫీరాజా అనే మరో సినిమా వదలబోతున్నాడు నరేష్. టైటిల్ బాగానే ఉంది. క్యాచీగా కనిపిస్తోంది. జోకులు పేర్చి.. సరదాగా తీస్తే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. కానీ… టీజర్ చూస్తే అంత విషయం ఏమీ కనిపించం లేదు. నేను పాట్నా పావురాన్ని కాదు.. మైసూర్ మేకని కాదు, పూణె పిల్లిని కాదు.. రాజా సెల్ఫీ రాజా అనే డైలాగ్తో టీజర్ వదిలారు. ఆ డైలాగ్లో పంచ్ లేదు.. చూపించిన షాట్లలో కొత్తదనం లేదు. పాత నరేష్ సినిమలన్నీ కట్టకట్టుకొని గుర్తొచ్చాయి. అయితే గురుడు ఈసారీ స్నూఫ్లను, పేరడీ సీన్లనే నమ్ముకొన్నట్టు కనిపిస్తోంది. 30 ఇయర్స్ ఫృద్వీతో సరైనోడుకి పేరడీ చేసిన షాట్ కనిపిస్తోంది. నరేష్ ఎప్పట్లా.. స్నూఫ్లతోనే సినిమా నెట్టుకొచ్చేద్దాం అంటే ఎలా?? అందుకు ఇప్పుడు సంపూ తయారయ్యాడు కదా?
టీజర్లానే సినిమా కూడా ఉందంటే… నరేష్ హిట్టు ఇప్పట్లో కొట్టలేడన్నమాటే,