పక్కిల్లు తగలబడుతూంటే… తమ ఇంటిపై నీళ్లు పోసుకునే మేధావులు అందరూ ఒక్క సారిగా జూలు విదిలిచ్చారు. ఎన్టీఆర్ పేరుతో స్మారకనాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మిపార్వతిని ఆహ్వానించలేదంటూ… పైసా ఖర్చు కాని సోషల్ మీడియా… పైగా డబ్బులిచ్చే జగన రెడ్డి మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. లక్ష్మిపార్వతి కూడా తాను ఎన్టీఆర్ భార్యనని మెడలో బోర్డు పెట్టుకుని తిరగాలా అంటూ… పెద్ద పెద్ద మాటలతో తెరపైకి వచ్చింది. కానీ ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. వాటి గురించి చర్చించుకునే ముందు… లక్ష్మిపార్వతికి మద్దతుగా మాట్లాడుతున్న వారు తమ కుటుంబలోకి లక్ష్మిపార్వతి వంటి క్యారెక్టర్ ను అనుమతిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలి.
ఎన్టీఆర్ పై నిజంగా అభిమానం ఉంటే ఇలా వెంటపడి వేధిస్తారా ?
ఎన్టీఆర్ అంటే మేరునగధీరుడు. ఆయన ఎంత మంది అందగత్తెలతో ఆడిపారారో అందరికీ తెలుసు. కానీ ఆయన కూడా మానవమాత్రుడే. ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు.. ఎన్నో అంశాల్లో తననదైన స్థిరాభిప్రాయంతో అనుకున్నది సాధించి ఉండవచ్చు. కానీ జీవితంలో ఆయన చేసిన తప్పు ఒక్కటే. అది చీకటి అధ్యాయంగా అందరూ మర్చిపోయారు. కానీ ఆయన పతనానికి కారణమైన అవశేషం మాత్రం… ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఏ చిన్న కార్యక్రమం జరిగినా వివాదాల్లోకి తెచ్చి వేధిస్తూనే ఉన్నారు. ఎంతగా అంటే… నిన్నటికి నిన్న పురందేశ్వరిపై ఆమె చేసిన కామెంట్లు వింటే… ఎవరికైనా ఎన్టీఆర్ పై జాలి కలగకుండా ఉంటుందా ? .
ఎన్టీఆర్ కుటుంబంపై ఈ నిందలేంటి ?
వైసీపీలో ఓ పదవి పొంది ఎన్టీఆర్ ని నిరంతరం అవమానిస్తున్నా ఒక్క మాట మాట్లాడకుండా.. తగుదునమ్మా అంటూ ఎన్టీఆర్ కుటుంబంపై విషం చిమ్మే లక్ష్మి పార్వతికి.. .. దురుద్దేశం లేదని ఎవరైనా అనగలరా ? . జూఎన్టీఆర్ కు ఎన్టీర్ పోలికల్లేవని… వెగటుపుట్టే పోలిక తెచ్చిన ఆమె వీడియోలు చూస్తే… ఎవరికైనా ఇలాంటి మనిషినా సహిస్తోందని ఎవరికైనా అనిపిస్తోంది. అనేక సందర్భాల్లో ఆమె ఎన్టీఆర్ సంతానంపైనా.. ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు విన్న వారెవరికైనా… ఆమెపై సదభిప్రాయం కలుగుతుందా ?. ఎన్టీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే వారితో చేతులు కలిపి … తాను ఎన్టీఆర్ భార్యనని చెప్పుకుంటే చెల్లుతుందా ?
లక్ష్మిపార్వతికి మద్దతుగా మాట్లాడేవారు … తమ ఇంట్లోకి రానిస్తారా ?
లక్ష్మిపార్వతికి మద్దతుగా మాట్లాడేవారు ముందు తమ కుటుంబంలో పరిస్థితుల్ని గమనించుకోవాలి. అలాంటి మహిళను తమ ఇంట్లోకి రానిస్తారో లేదో చూడాలి. తమ కుటుంబ పెద్ద చివరి రోజుల్లో ఇలాంటి పని చేస్తే.. ఆ మహిళను ఎలా చూస్తారో అర్థం చేసుకోవాలి. అప్పుడే సగటు కుటుంబీకుల బాధ అర్థమవుతుంది. మహానుభావుడు చనిపోవడానికి ప్రత్యక్ష కారణం అని అందరికీ తెలుసు … అయినా ఆమెను సమర్థిస్తూ.. ఎన్టీఆర్ కుటుంబాన్ని వెంటాడే ప్రయత్నం చేస్తున్నారంటే… అంత కంటే మానసిక రోగం మరొకటి లేనట్లే. పక్కిల్లు .. ముఖ్యంగా తమకు ఇష్టం లేని… కారణం కూడా తెలియకుండా వ్యతిరేకించే కుటుంబం నష్టపోవాలి కానీ.. తమకు మాత్రం అలాంటి కష్టాలు రాకూడదని అనుకుంటారు.
లక్ష్మిపార్వతిని సమర్థిస్తున్న వారందరి ఇళ్లల్లోకి .. అలాంటి ఓ క్యారెక్టర్ రావాలని కోరుకుంటే అందులో తప్పేమీ ఉండదు. ఎందుకంటే… అప్పుడే ఎన్టీఆర్ కుటుంబ బాధ వారికి అర్థమవుతుంది మరి.