రాజకీయంగా విబేధాలుండవచ్చు. ఎన్టీఆర్ కులం అంటే నచ్చకపోవచ్చు. జగన్ రెడ్డి కులం అంటే నచ్చవచ్చు. ఇంకేదైనా అభిమానం ఉండవచ్చు. కానీ ఆ పేరుతో… కొన్ని రకాల గౌరవాల్ని కించపర్చాలనుకోవడం మానసిక రోగమే అవుతుంది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై కొంత మంది మేధావులు అది చెల్లదండగా అని తమ మానసిక వికృతాన్ని బయట పెట్టుకున్నారు. అది చూసినా చాలా మంది… హి..హి. హి అని కామెంట్లు పెట్టుకుని అడ్డగోలు కామెంట్లు చేస్తున్నారు. వీరిలో చాలా మంది చదువుకున్న వాళ్లు…. ఉన్నారు. కానీ సంస్కారం లేని వాళ్లని అర్థమవుతుంది. కనీస విషయ పరిజ్ఞానం లేని వాళ్లని కూడా అర్థమవుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణేలు సాధారణ చెలామణిలోకి రావు. అవి ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉంచుతారు. ఇటువంటి నాణేలు మహాపురుషుల జయంతి లేదా ఏదైనా ప్రత్యేక రోజున జారీ చేస్తారు. స్మారక నాణెలను చెలామణి కోసం ఆర్బీఐ విడుదల చేయదు. ఇటీవ ప్రధాని మోదీ 75 ఏళ్లు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రూ. 75 నాణెం విడుదల చేశారు, ఇది చెల్లదంటగా అని ఎగతాళి చేస్తారా ?
ఎన్టీఆర్ నాణెనాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ కలిపి తయారు తేళాపు, ఈ నాణెం తయారీకి మూడు వేలకుపైగా ఖర్చవుతుంది. గరిష్టంగా రూ. 4,850 వరకు నాణెం ధర ఉంటుంది. స్మారక నాణెం కాబట్టి మార్కెట్లో చలామణిలో ఉండదని, ఆ మహానుభావుడి గుర్తుగా ఈ నాణేన్ని తమ దగ్గర దాచుకుంటారని ఆర్బీఐ ప్రకటించింది. తొలి విడతలో 12,000 నాణేలను ముద్రించారు. అన్నీ అయిపోయాయి. రెండో ముద్రణ చేసి డిమాండ్ తీరుస్తామని హైదరాబాద్ మింట్ అధికారులు చెబుతున్నారు.
కులం క్యాన్సర్ బారిన పడిన వారికి… ఏదైనా అలాగే అనిపిస్తుంది. వారిని మనం ఏమీ అనలేం… గెట్ వెల్ సూన్ అని ఆశీరవదించడం తప్ప. ఎవరి వికృతం వారిది !