భారత ఐటీ కంపెనీలు వినూత్న వ్యూహాన్ని పాటించేందుకు సిద్ధమయ్యాయి. పూర్తిగా స్కిల్డ్ మ్యాన్ పవర్ మీద ఆధారపడే ఐటీ రంగంలో.. కంపెనీలు ఎక్కువగా పెట్టే పెట్టుబడి కూడా మ్యాన్ పవర్ మీదనే ఉంటుంది. అయితే ఆ ఖర్చు భరించలేనంతగా పెరిగితే కంపెనీ సామర్థ్యం దెబ్బతింటుంది. అందుకే ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల్ని బట్టి కంపెనీలు కూడా వ్యూహం మార్చుకుంటున్నాయి. భారీ జీతాలు ఉన్న సీనియర్లను పక్కన పెట్టి. ఫ్రెషర్లను అత్యధికంగా నియమించుకునే ఆలోచన చేస్తున్నాయి.
ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 42 వేల మంది ఫ్రెషర్స్ ను నిమించుకుంటోంది. దీనికి సంబంధించి క్యాంపస్ ఇంటర్యూలతో పాటు ఆఫ్ క్యాంపస్ ఇంటర్యూలను జోరుగా నిర్వహిస్తోంది. అదే సమయంలో జీతాల పెంపుదల విషయం, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రోత్సాహాకాల అంశంలో మాత్రం కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. దీంతో సీనియర్ల విషయంలో కంపెనీ ప్రోత్సాహకాలు తగ్గించి హెడ్ కౌంట్ పెంచుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చేస్తోంది.
ఇతర కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి. ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత ఎక్కువ మంది ఐటీ ఇండస్ట్రీపై ఒత్తిడి ఉంటుందని అనుకున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఐటీ ఉత్పత్తులే ఎగుమతి అవుతాయి. ఈ కారణంగా క్లయింట్లు తగ్గిపోతారని మాస్ లే ఆఫ్స్ తప్పవన్న ప్రచారం జరిగింది. కానీ ట్రంప్ .. చర్చల కోసం 90 రోజుల పాటు పన్నులను నిలిపివేయడంతో కాస్త రిలీఫ్ పీల్చుకున్నారు. పరిస్థితిని బట్టి ఈ మూడు నెలల్లో పన్నులు పెంచినా క్లయింట్లను కాపాడుకునేలా.. కంపెనీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయని అనుకోవచ్చు.