అక్రమాస్తుల కేసుల్లో తనపై నమోదైన కేసులన్నింటినీ.. ఒకే సారి విచారణ జరపాలంటూ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మరోసారి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడేళ్లలో ఇలాంటి పిటిషన్లు వేస్తూ.. విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ వాదించింది. నేరాలన్నీ.. విడివిడిగా చేశారని.. నిందితుల్లో కామన్‌గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ.. ఇతర నిందితులు మాత్రం వేరని స్పష్టం చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల్లోనూ.. విడివిడిగా విచారణ జరిపి… విడివిడిగానే శిక్షలు విధించిన సంగతిని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది.
ఏడేళ్లుగా… సీబీఐ కోర్టులో ప్రతీ శుక్రవారం విచారణ జరుగుతోంది. వాస్తవానికి తుది విచారణ మాత్రం ఇంత వరకూ ప్రారంభం కాలేదు. కేవలం.. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నిందితులు దాఖలు చేస్తున్న వివిధ రకాల పిటిషన్లపై విచారణ జరుపుతున్నారు. హైకోర్టులో కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటిని కొన్నింటిని హైకోర్టు కూడా కొట్టి వేసింది. వాటిపై విచారణ ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో.. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి.. మళ్లీ కొత్తగా అన్ని కేసుల్ని కలిపి విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి… అవి తేలే వరకూ.. అసలు విచారణ ప్రారంభం కాకూడదని.. జగన్, విజయసాయిరెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ఈ వ్యవహారాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా సీబీఐ.. జగన్, విజయసాయిరెడ్డిల పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి.. చిన్న మినహాయింపు ఇవ్వడానికి కూడా సిద్ధపడటం లేదు. వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో.. తీవ్రంగా వాదనలు వినిపించిన.. సీబీఐ.. ఇప్పుడు.. కొత్తగా వేసిన పిటిషన్‌పై.. మరింత ఘాటుగా జడ్జికి వాదనలు వినపించింది. విచారణ ఆలస్యం చేయడానికే.. ఇలా చేస్తున్నారని మండిపడింది. ఆర్థిక నేరాల కేసుల్లో.. త్వరగా విచారణ పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సీబీఐ.. కూడా.. అక్రమాస్తుల కేసును వీలైనంత త్వరగా తేల్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.