వైఎస్ కుమార్తె, కుమారుడు రాజకీయాల్లో ఉన్నారు. ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకొకరు రాజకీయంగా ఆయనపైనే పోరాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన కుమారుడికి మాత్రం నోట్లో మాటలు రావడం లేదు. ప్రసంగం ప్రారంభించే ముందు గుడ్నార్మింగ్ అని చెప్పాల్సి ఉన్నా చదివి .. చూసి చెబుతారు. కానీ షర్మిల మాత్రం.. అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. షర్మిల ప్రసంగాలు.. జగన్ రెడ్డి చూచి చదవడాల్ని కంపేర్ చేసుకుని వైసీపీ నేతలు కూడా హతవిథీ అనుకుంటున్నారు.
జగన్ రెడ్డి నేరుగా ప్రసంగించడం లేదా.. ప్రెస్ మీట్, డిబేట్లకు వెళ్తే ఎలా ఉంటుందంటే.. బీకామ్ అంటే… బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేంత అమాయకత్వంగా ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఉండదు. నేరుగా మాట్లాడలేరు. కనీసం రాజకీయ అంశాలపైనైనా తాను స్పందించవచ్చు. కానీ ఆయన స్పందించరు. ఎందుకంటే ఆయనేం మాట్లాడతారో ఆయనకు తెలియదు. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పని చేసే రైటర్ల బృందం రెడీ చేస్తుంది. జగన్ రెడ్డి చదువుతారు. అర్జునుడు.. అభిమన్యుడు అంటూ వారు సినిమా స్క్రీన్ ప్లే రాస్తే.. జగన్ రెడ్డి పాటిస్తారు.
కానీ షర్మిల మాత్రం ముందస్తు అధ్యయనం చేసి వచ్చి ప్రసంగాలు చేస్తున్నారు. గంట మాట్లాడినా ఆమె చేతిలో పేపర్ ముక్క ఉండదు. తాను చెప్పాలనుకున్నది చెబుతారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు. ఈ విషయంలో జగన్ రెడ్డి కన్నా షర్మిల ఎంతో మేలు అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. కార్యకర్తల్లో ఊపు తెచ్చేలా షర్మిల ప్రసంగాలు చేయడంలో రాటుదేలిపోయారు. జగన్ రెడ్డిపై నేరుగా ఎటాక్ చేస్తూ.. తన ఉద్దేశం కూడా ఏమిటో స్పష్టత నిస్తున్నారు. కానీ జగన్ రెడ్డికి మాత్రం చూసి చదవాల్సిన పరిస్థితి తప్పడం లేదు.