టీవీ యాంకర్ రవి వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి తనని బెదిరించడాని, తనపై దాడికి ప్రయత్నించాడని సందీప్ అనే పంపిణీదారుడు రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం ఏమిటంటే.. సందీప్‌కి రవి ఇది వరకు రూ.28 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వడ్డీ విషయంలో రవికీ, సందీప్‌కీ మధ్య వివాదం మొదలైంది. `మాట్లాడుకుందాం రా` అంటూ ఓ చోటికి పిలిచి, తన స్నేహితులతో దాడికి దిగాడని సందీప్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు. తరవాత ఏమైందో.. సందీప్ తన ఫిర్యాదుని వాపసు తీసుకోవడంతో… రవిని పోలీస్ స్టేషన్ నుంచి పంపించి వేశారు. వడ్డీ విషయంలో రవి వెనక్కు తగ్గాడని, అందుకే ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. ఈటీవీ లో కొన్ని కామెడీ షోలకు రవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. హీరోగా ఓ సినిమా కూడా చేశాడు.