ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. అయితే ఆ ఫిర్యాదుల్లో ఈటల కుటుంబానికి సంబందించినవి ఉంటే మాత్రం.. చాలా పవర్ ఫుల్. నేరుగా అవి సీఎం దృష్టికే వెళ్తాయి. ఆయన కూడా వెంటనే విచారణకు ఆదేశిస్తారు. గతంలో ఈటల భార్య జమన పేరుపై ఉన్న హేచరీస్ విషయంలో అంతే స్పందించారు. ఆ విషయం వివాదాస్పదమయింది. తాజాగా.. మరోసారి ఈటల కుమారుడు నితిన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కేసీఆర్ వేగంగా స్పందించారు. తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి మహేశ్… ఇక తన భుమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని రెండు రోజుల కిందట.. మేడ్చల్ జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తనకుఅందిన వెంటనే… కేసీఆర్ విచారణకు ఆదేశించారు. సీఎస్ సోమేశ్‌కుమార్, అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ అన్ని శాఖలూ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈటలకు సంబంధించిన ఆరోపణలనే సీఎం కేసీఆర్ ఎందుకు సీరియస్‌గా తీసుకుని అప్పటికప్పుడువిచారణకు ఆదేశిస్తున్నారో …రాజకీయవర్గాలు సులువుగానే అంచనా వేస్తున్నాయి.
ఈటల రాజేందర్‌తో పాటు.. సీఆర్ కేసీఆర్.. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. ఈటల తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనను బలహీనం చేయడానికి కేసీఆర్.. చేయగలిగినదంతా చేస్తున్నారు. అధికారం ఆయనకుఅడ్వాంటేజ్గా ఉంంది. భూముల విషయంలో… లూప్ హోల్స్ ఉండటంతో ఈటలను ఇబ్బంది పెట్టగలుగుతున్నారని అంటున్నారు. ఈటల ఈ అంశాలన్నీ రాజకీయంగానే చూస్తున్నారు. తోడళ్లలా దాడి చేస్తున్నారని మండి పడుతున్నారు. వెనక్కి తగ్గేదిలేదని అంటున్నారు. ఈటల వర్సెస్ కేసీఆర్ పోరాటం.. ముందు ముందు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.