కోడెల ఆత్మహత్యకు కారణం అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చిక్కులు ఎదుర్కోబోతున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో పిచ్చిపట్టినట్లుగా టీడీపీ నేతల్ని తప్పుడు కేసులతో వేధించడానికి దేనికైనా దిగజారిపోయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వాటి ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నారు. కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు తన వద్ద డబ్బులు తీసుకున్నారని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన నాగరాజు అనే మోసగాడు ఇప్పుడు బయటకు వచ్చాడు.
అప్పట్లో తనను విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బెదిరించి తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించాడు. ఈ నాగరాజు మామూలు వ్యక్తి కాదు. ఎంతో మంది ప్రముఖుల్ని మోసం చేసిన వ్యక్తి. కొన్ని కేసుల్లో అరెస్టయినప్పుడు అతన్ని ఉపయోగించుకుని కోడెలపై కూడా తప్పుడు కేసులు పెట్టించారు. ఇప్పుడు నాగరాజు..తనతో తప్పుడు కేసులు పెట్టించారని చెప్పడంతో కోడెల వర్గీయులు విజయసాయిరెడ్డిపై కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
విజయసాయిరెడ్డి .. అప్పట్లో కోడెలపై ఫిర్యాదులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో చాలా మంది తప్పుడు కేసులు పెట్టారు. చివరికి ఫర్నీచర్ విషయంలోనూ వేధించారు. ఈ బాధలు పడలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. దానికి బాధ్యత విజయసాయిరెడ్డి వహించాల్సి ఉంటుందని టీడీపీ క్యాడర్ అంటున్నారు.