ఎన్నికలకు ముందు ఏపీలో చేపట్టిన టీచర్ల బదిలీల్లో తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చిక్కులు ఎదుర్కోక తప్పదా..? ఎన్నికల కోడ్ ఉండగానే బదిలీలు చేపట్టి రూల్స్ ను అతిక్రమించిన బొత్స ఈ బదిలీల పేరిట ఉపాధ్యాయుల నుంచి 65 కోట్లు వసూలు చేశారా..? టీచర్ల బదిలీల్లో అవినీతికి పాల్పడ్డారని బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు అందటంతో ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
టీచర్ల బదిలీలు మంత్రి బొత్స కనుసన్నలోనే జరిగాయని..పెద్దఎత్తున ఆయన అవినీతికి పాల్పడ్డారని టీడీపీ అప్పట్లోనే ఆరోపించింది. ఈ విషయంలో విచారణ చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. బదిలీల కోసం ఒక్కో టీచర్ నుంచి ఆయన మూడు నుంచి 6 లక్షల వరకు దండుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ ఉండగానే టీచర్ల బదిలీలు చేపట్టడం వివాదాస్పదం అయింది. టీచర్ల బదిలీల్లో 65కోట్ల అవినీతికి బొత్స పాల్పడ్డారని ఫిర్యాదు అందటంతో ఏసీబీ ఎలాంటి చర్యలు చేపడుతుంది అన్నది ఆసక్తి రేపుతోంది. బొత్స అవినీతిపై తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుండటంతో బొత్స చిక్కులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.