టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో విస్తృతంగా ఫిర్యాదులు చేసేవారు. ఉపాధి హామీ పనుల దగ్గర్నుంచి పోలవరం అంచనాల వరకు ఎన్నెన్ని ఫిర్యాదులు చేసేవారో లెక్కలేదు. ఆ ఫిర్యాదుల ఆధారంగా కేంద్రంలోని శాఖలు నిధులు పెండింగ్లో పెట్టేవి. విచారణ జరిపి ఎప్పుడో విడుదల చేసేవి. అప్పుడు టీడీపీ నేతుల వైసీపీపై ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఆ ఫిర్యాదుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రుచి చూస్తున్నారు. ఆ ఫిర్యాదుల బాధ్యతను టీడీపీ… లేకపోతే రఘురమ తీసుకున్నారు. కేంద్రం నిధులు విచారణ పేరుతో ఎక్కడిక్కకడ పెండింగ్ పెట్టేసింది.
రాజధాని భూముల్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని ఇటీవలఏపీ ప్రభుత్వం హడ్కోకు భూముల్ని రిజిస్ట్రేషన్ చేసింది. కానీ రఘురమకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దాంతో అవి ఆగిపోయాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగం సెంట్ ఇళ్ల స్థలాల పనులు చేయించాలనుకున్నారు. కానీ కేంద్రం అంగీకరించలేదు. పోలవరం పనులపై రెగ్యులర్గా ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో పనులు ఆగిపోతున్నాయి. పనులు చక్కబెట్టాల్సిన ఎంపీలకు ఎక్కడా లేనంత కోపం వస్తోంది. హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఒక పిటిషన్ పెట్టించారని.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారని కేంద్రంలోఏ శాఖ దగ్గరకు వెళ్లినా టీడీపీ పెట్టిన ఫిర్యాదులు ఉన్నాయంటున్నారు.
నిధులిచ్చే సంస్థలకు ప్రతిపక్షాలు లేఖలు రాస్తూ అడ్డుపడుతున్నారని మాట్లాడితే అప్పులు, అప్పులు అంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ అప్పు చేయలేదా? అప్పు లేకుండా ఏ ప్రభుత్వమైనా ఉందా? అని ఎంపీలు పిల్లి సుభాష్, వంగా గీత ఫైరయ్యారు. కేంద్రంలో ఏ శాఖ దగ్గరకు వెళ్లినా ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులే కనిపిస్తున్నాయన్నారు. గతంలో టీడీపీ నేతల అసహనమే ఇప్పుడు వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అంటే సీన్ రివర్స్ అయిందన్నమాట అని టీడీపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.