‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి డిఫరెంట్ మూవీ ద్వారా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయిన మేర్లపాక గాంధీ లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ బేనర్లోనే రన్ రాజా రన్ చేసిన శర్వానంద్ ఆ టైటిల్లోని రాజాని వదిలి పెట్టలేదు. అలాగే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఎక్స్‌ప్రెస్‌ని వదిలి పెట్టలేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వున్న ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లో చాలా విషయాలు వున్నాయట. అవి సినిమా చూస్తే గానీ అర్థం కావట. అయితే ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు డైరెక్టర్ గాంధీ ఒక కండీషన్ పెట్టాడు. అదేమిటంటే ప్రతి ఆడియన్ సినిమాను బిగినింగ్ నుంచి చూడాలట. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత మొదటి పది నిముషాలే సినిమాకి మెయిన్ అని, ఆ 10 నిముషాల సినిమా చూస్తేనే ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ అవ్వగలుగుతారని చెప్తున్నాడు.
యు.వి.క్రియేషన్స్‌లో వచ్చిన సినిమాలన్నీ డిఫరెంట్‌గా వుంటూ కమర్షియల్‌గా కూడా సక్సెస్ సాధిస్తున్నాయి. అలాగే ఈ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రంలో కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఏదో వుందని, అందుకే డైరెక్టర్ అంత కాన్ఫిడెంట్‌గా వున్నాడని అర్థమవుతోంది. జనవరి 14న ‘డిక్టేటర్’తోపాటు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ తరహా ఆడియన్స్‌కి రీచ్ అవుతుందో, ఎంతవరకు సక్సెస్ అవుతుందో వెయిట్ అండ్ సీ.