గ్రూప్ 1 పరీక్ష ఖచ్చితంగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం అభ్యర్థుల్లో 95 శాతం మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని మిగిలిన వారు కూడా ఆ పని చేసి పరీక్షకు హాజరవ్వాలని లేకపోతే విలువైన సమయం కోల్పోతారని హెచ్చరించారు. అంటే ప్రభుత్వం పరీక్ష నిర్వహించాలని డిసైడయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తుందని అనుకోవచ్చు.
అయితే ఏం చేద్దాం అని అర్థరాత్రి వరకూ మంత్రులు చర్చించారు. ఆందోళనలు చేస్తున్న వారి డిమాండ్లపై చర్చించారు. ఇప్పటికే జీవో 29తో అభ్యర్థులకు జరుగుతున్న నష్టం ఏమిటని పీసీసీ చీఫ్ కూడా ఆరా తీశారు. ఏమీ లేదని వారు తేల్చడంతో అదే విషయం వివరణ ఇవ్వాలని, జీవో 55, జీవో 29లకు తేడాను స్పష్టంగా చెప్పాలని నిర్ణయించారు. ఆదివారం అదే వివరణను ప్రభుత్వం ఇవ్వబోతోందిని..
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా అనే ప్రశ్నే రాదని ఇప్పటికీ క్లారిటీ వచ్చింది.
గ్రూప్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న వారిలో అత్యధికులు తమ సన్నద్ధతపైనే దృష్టి పెట్టారు. కొద్ది మంది మాత్రమే జీవోల పేరుతో రెడ్డెక్కుతున్నారు. వారి వెనుక రాజకీయం ఉంటోంది. ఆందోళనల్లో పాల్గొనేవారిలో చాలా మంది అసలు గ్రూప్స్ అభ్యర్థులు కాదన్న అభిప్రాయం ఉంది. వెనక్కి తగ్గితే నష్టపోయేవారే ఎక్కువగా ఉంటారని భావిస్తున్నారు. వాయిదా వేసేందుకూ ప్రభుత్వం ఆసక్తిగా లేదు.