నిన్న డిల్లీలో సమావేశమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. వాటిలో ప్రధానంగా రెండు నిర్ణయాల గురించి చెప్పుకోవాలసి ఉంటుంది. 1. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలం మరో ఏడాది పాటు పెంచడం 2. పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ, మహిళలకు ప్రాధాన్యం కల్పించడం.
బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జనతా పరివార్ తో కలిసి పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 40సీట్లు కేటాయించారు. కానీ ఒకవేళ అప్పుడు కూడా ఓడిపోతే రాహుల్ గాంధీకి అప్రదిష్ట కలగకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక పార్టీలో వివిధ వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చును. పార్టీలో నాయకుల మహిళా కుటుంబ సభ్యులు ఆ 50 శాతం రిజర్వేషన్ ఎగరేసుకు వెళ్లిపోకుండా నియమ నిబంధనలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే అర్హులకు అవకాశం దక్కుతుంది. పార్టీ పదవులతో బాటు పార్టీ టికెట్స్ కేటాయింపులో కూడా 50 శాతం రిజర్వేషన్ కేటాయించి ఉండి ఉంటే మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉండేది. కానీ మిగిలిన పార్టీలతో పోల్చి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది.