కాంగ్రెస్ పార్టీలో ఓ నిర్ణయం తీసుకోవాలంటే చాలా సమయం పడుతోంది. నాన్చి ,నాన్చి మెల్లగా ప్రకటించేస్తారు. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే సమయంలో, మొన్న మహేష్ కుమార్ గౌడ్ నియామకం టైంలోనూ ఎంత సమయం తీసుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. అధికారం చేపట్టాక కూడా ఇంత ఆలస్యమా అనే వాదనలు వినిపించాయి.
కట్ చేస్తే..ఇప్పుడు బీజేపీ కూడా అదే ధోరణి అవలంభిస్తోంది. బీజేపీలో నిర్ణయం తీసుకునేందుకు గతంలో ఎక్కువ కాలం పట్టేది కాదు. ఇప్పుడు మాత్రం ఎందుకో నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఈ ఆలస్యం వల్లే పార్టీ గ్రాఫ్ పతనం అవుతున్నా..వేగం పెంచడం లేదు.
వాస్తవానికి బీజేపీలో జోడు పదవులు ఉండవు. కానీ, కిషన్ రెడ్డికి ఎనిమిది నెలలుగా రెండు పదవులున్నాయి. ఇదిగో.. తెలంగాణ బీజేపీ చీఫ్, అదిగో బీజేపీ చీఫ్ అనే ప్రకటనలు ఆచరణరూపం దాల్చడం లేదు. ఇటీవల కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జనవరి చివరాఖరులో ప్రెసిడెంట్ నియామకం ఉంటుందన్నారు.ఇప్పుడేమో స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యాక అంటున్నారు.
దీంతో.. బీజేపీ కూడా కాంగ్రెస్ దారిలో పయనిస్తోంది అనే వాదనలు కమలం కాంపౌండ్ లొనే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇదే విషయంలో కాంగ్రెస్ ను వెక్కిరించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఆ వెక్కిరింతను ఇతర పార్టీల నుంచి ఎదుర్కొంటున్నారు.