మజ్లిస్‌తో అంతర్గత ఒప్పందానికే కాంగ్రెస్ రెడీ అయింది. సానియా మీర్జా నుంచి నాంపల్లి లీడర్ ఫిరోజ్ ఖాన్ వరకూ బలమైన పేర్లే ప్రచారంలోకి తెచ్చి
చివరికి హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్‌కు మేలు చేయాలని డిసైడైనట్లుగా తెలుస్తోంది. అధికారంలో లేనంత కాలం తమ పార్టీని కించ పరచడమే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోనూ ఓడించేందుకు ప్రయత్నించిన మజ్లిస్ తో కాంగ్రెస్ ఫ్రెండ్ షిప్‌కు సిద్ధమైంది. హైదరాబాద్ లోక్‌సభ బీసీ అభ్యర్థిని పెట్టాలనుకుంటోంది.
కారణం ఏదైనా ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వక బంధాన్ని నెరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంభిస్తూ క్రమంగా బిఆరెస్ కు దూరం జరుగుతున్నారు. బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. ఈ కారణంగానే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలో ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్‌లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బిసి అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కనబెట్టి బీసీ అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా సమాచారం పంపారు. బీఆర్ఎస్ ను గెలిపించడానికి మజ్లిస్ శాయశక్తులా ప్రయత్నించింది. అయినా కాంగ్రెస్ గెలిచింది. ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగడం మజ్లిస్ స్టైల్. కాంగ్రెస్ కూడా రెడీ అయిపోయింది.