కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ కు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించారు. ఆయన పేరు జెట్టి కుసుమకుమార్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ కుసుమకుమార్ ఎవరో చాలా మందికి తెలియదు. హఠాత్తుగా… రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పొన్నం ప్రభాకర్ తో పాటు.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవిలోకి వచ్చి పడ్డారు. ఈయన మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత. సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి స్నేహితుడని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.. టిక్కెట్ల పంపిణీలో భాగంగా.. కమ్మ సామాజికవర్గానికి.. కాంగ్రెస్ పార్టీ… ఒక్క టిక్కెట్ కూడా కేటాయించలేదు. దీంతో.. రేణుకాచౌదరి లాంటి అగ్ర నేతలు.. కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని కొంత మంది కమ్మ సామాజికవర్గ నేతలు కూడా.. అసంతృప్తి స్వరాలు పెంచే అవకాశం కనిపిస్తూండటంతో… రాహుల్ గాంధీ.. వేగంగా… అదే సామాజికవర్గానికి చెందిన జెట్టి కుసుమకుమార్ ను… వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. కమ్మ సామాజికవర్గం అసంతృప్తికి గురి కాకుండా.. ఉన్న పళంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో సామాజిక సమీకరణాల చిచ్చు రేగుతోంది. కాంగ్రెస్ రెండు దఫాలుగా 75 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది.రెండు జాబితాల్లోనూ అన్యాయం జరిగిందని బీసీలు, కమ్మ సామాజిక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 65 మందితో కూడిన మొదటి జాబితాలో 12 సీట్లు బీసీ లకు ఇచ్చారు. 10 మందితో విడుదల చేసిన రెండో జాబితాలో ఇద్దరు బీసీ లకు చోటు దక్కింది. ఇప్పటి వరకు 14 సీట్లు బీసీలకు కేటాయించారు.తెలంగాణలోని 119 స్థానాలలో కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 24 సీట్లు టీడీపీ, టీజేఎస్,సీపీఐ లకు కేటాయించింది..95 స్థానాల్లో ఇప్పటి వరకు 75 స్థానాలు ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లోనూ 5 లేదా 6 స్థానాలకు మించి బీసీ లకు దక్కేలా లేవు. కూటమి మొత్తం గా చూసినా 25 స్థానాలకు మించేలా లేవు… గత ఎన్నికల్లో పోటీ చేసిన బీసీ నేతలకు కూడా ఈసారి సీట్లు దక్కలేదు.ఎక్కువ సీట్లు కూటమి పొత్తుల్లో గల్లంతయ్యాయి. బీసీలకు అన్యాయం చేశారని.. క్యామ మల్లేష, భిక్షపతి యాదవ్ లాంటి నేతలు.. తిరుగుబాటు చేశారు.
బీసీలకు కేటాయిచిన సీట్లలో కూడా… కొంత మంది నాయకులు.. తిరుగుబాట్లకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ లో స్థానికేతరుడైన దాసోజు శ్రవణ్ కు ఇచ్చారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రోహిన్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు జాబితాలలో రెడ్లకు పెద్ద పీట వేశారు..75 మందిలో 29 స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు..మూడో జాబితాలో మరికొంత మందికి అవకాశం దక్కనుంది.