కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను తూ. చ తప్పకుండా అమలు చేస్తుందని .. దానికి తెలంగాణనే సాక్ష్యమని ఢిల్లీ ప్రజలు ఆ పార్టీ చూపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ మరో రెండు గ్యారంటీలు ఇచ్చింది. అందులో ఒకటి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్, మరొకటి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఈ రెండు హామీలను రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను , గ్యారంటీను నెరవేర్చి చూపించామని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజునే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించామన్నారు. రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్., ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. రూ. ఇరవై !ఒక్కవేల కోట్లు రూణాలను ఒకే సారి మాఫీ చేశామని .. రైతుల్ని ఆదుకున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. విస్తృతంగా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం గత పదకొండు ఏళ్లలో కేవలం ఏడు లక్షల ఉద్యోగాలనే కల్పించిందని గుర్తు చేశారు. కానీ ఆయన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేశారన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ బాగా ఉండటంతో ఆయనతో ప్రచారం చేయించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. గ్యారంటీలను తెలంగాణలో పక్కాగా అట్లే చేస్తున్నారన్న అభిప్రాయం నార్త్ ప్రజల్లోఉందని అంటున్నారు. అందుకే రేవంత్ తో మరో రెండు గ్యారంటీల్ని విడుదల చేయడం ద్వారా నమ్మకం మరింత ఎక్కువగా కల్పించాలనుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరాటం సాగుతోంది.