పుష్ప వ్యవహారంతో పాటు చాలా విషయాల్లో రేవంత్ రెడ్డికి కేంద్రం సహకారం ఉందని ఆయన మోడీకి బాగా దగ్గరయ్యారని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే బీజేపీ రాజకీయ వ్యూహాలను చూస్తే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం కన్నా ఎవరి రాజకీయానికి వారిని వదిలేస్తే మంచిదని అనుకుంటారు. అందుకే తమ సహకారం ఉందని జరిగే ప్రచారానికి కౌంటర్లు ఇస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు అక్రమం అని బహిరంగంగానే చెబుతున్నారు.
చట్టపరంగా జరిగే వ్యవహారాల విషయంలో బీజేపీ జోక్యం చేసుకోదు. నిజానికి పుష్ప వ్యవహారం చాలా చిన్నది. అది సినిమా హీరోకు సంంబధించిన అంశం కాబట్టి హాట్ టాపిక్ అయింది. ఇలాంటి వాటిలో కేంద్రం స్థాయిలో ఎవరైనా జోక్యం చేసుకునే అవకాశం లేదు. చేసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత రేవంత్ ఉంది. ఇతర బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేసినట్లుగా కేంద్రం, బీజేపీ రేవంత్ ను టార్గెట్ చేయడం లేదు. అది ఆయనకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు.
మాములుగా బీజేపీ టార్గెట్ చేస్తే రేవంత్ కు చాలా చిరాకులు వస్తాయి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది మాత్రమే అయింది. తొందర పాటు ఎందుకని ఆగుతున్నారో లేకపోతే బీజేపీ విషయంలో రేవంత్ రెడ్డి నొప్పింపక , తానొవ్వక అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సైలెంటుగా ఉంటున్నారో కానీ ఈ వ్యవహారం రేవంత్ రెడ్డికి మాత్రం అనుకూలంగానే ఉంది. బీజేపీ టార్గెట్ చేయకపోవడమే ఆయనకు పెద్ద ప్లస్.