ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కాస్త గుర్తింపు ఉన్ననేతల్లో హర్షకుమార్ ఒకరు. ఆయన ఇప్పుడు పార్టీపై అలిగారు. తన రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇటీవలి కాలంలో కాస్త యాక్టివ్‌గా ఉంటున్న హర్షకుమార్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే… ట్విట్టర్ గొడవ. కాంగ్రెస్ పార్టీతో ఇటీవల ట్విట్టర్ రగడ పెట్టుకుంది. రాహుల్ గాంధీ ట్వీటర్ ఎకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కార్యకర్తలందరూ తమ ట్వీట్టర్ అకౌంటర్ పేర్లను రాహుల్ గాంధీగా మార్చుకోవడం ఒకటి.
అయితే అందరి కంటే భిన్నంగా ఆలోచించారు హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్. ట్విట్టర్ పిట్టను పట్టుకుని దాన్ని చంపి… ఫ్రై చేసి ట్విట్టర్ కార్యాలయానికి పంపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఫీలైంది. ఇలాంటి పనులు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించడమేనని ఖండిస్తూ.. జీవీ శ్రీరాజ్ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. తాను రాహుల్ గాంధీపై అభిమానంతోనే.. ట్విట్టర్‌కు నిరసన తెలిపాను కానీ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లుగా అనుకోలేదని ఆయన … ఆయనతో పాటు హర్షకుమార్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది.
శ్రీరాజ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసేశారు. దీంతో హర్షకుమార్ ఫీలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. బడుగు, బలహీనవర్గాల బాధితులకు మాత్రం అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వివాదం చివరికి ఏపీ కాంగ్రెస్ కు చికాకులు తెచ్చిపెట్టిందన్నమాట.