లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం … రాహుల్ గాంధీ అస్త్రసన్యాసం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో ఉంది. ఈ పరిస్థితుల్లో… కాంగ్రెస్ పార్టీకి.. కేంద్ర ప్రభుత్వ దూకుడు ప్రాణసంకటంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన అంశాలపై… కాంగ్రెస్ పార్టీకి..ఓ స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. కశ్మీర్ అంశం కాబట్టి… ఆ పార్టీకి చెందిన.. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్… పార్లమెంట్లో ప్రధానంగా కాంగ్రెస్ తరపున తన వాదన వినిపించారు. అదే కాంగ్రెస్ పార్టీ వాదనగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఆయన ఆర్టికల్ 370 రద్దును… జమ్మూకశ్మీర్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో.. కాంగ్రెస్ పార్టీకి కశ్మీర్ సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదన్న భావన ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో.. ఒక్క రోజులోనే .. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు.. సొంత పార్టీపైన తమ నిరసన గళం వినిపించడం ప్రారంభించారు.
నిన్న రాజ్యసభలో.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్‌గా వ్యవహరిస్తున్న ఎంపీ రాజీనామా చేసేశారు. ఈ రోజు.. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనకు అనుకూలంగా.. కాంగ్రెస్ ముఖ్యనేతలు గళమెత్తడం ప్రారంభించారు. సీనియర్ కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది ఓ అడుగు ముందుకు వేసి.. మోడీ, అమిత్ షాలు ..చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని చేశారని ప్రకటించేశారు. అంటే.. బీజేపీ వాళ్లు చెబుతున్నట్లుగా.. నెహ్రూ తప్పు చేశారని.. ద్వివేదీ కూడా అంగీకరించినట్లయింది. అలాగే.. సీనియర్ నేత దీపేందర్ హూడా సైతం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సదర్ ఎమ్మెల్యే అదితీ సింగ్ సైతం కశ్మీర్ నిర్ణయం పట్ల కేంద్రానికి మద్దతుగా నిలిచారు.
ఈ పరిణామాలతో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్రమత్తమయ్యారు. ఆయన… కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించకపోయినా… భూమిని కలుపుకోవడం… కాదని.. మనుషుల మనసుల్ని గెలుచుకోవాలన్నట్లుగా.. అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు.. వలసలు… రోజు రోజుకు చిక్కిపోతున్న క్యాడర్… ఇలాంటి వాటికి తోడు ప్రస్తుతం… కశ్మీర్‌తో.. బీజేపీ తెచ్చి పెట్టిన సంక్షోభం.. కాంగ్రెస్‌కు మరింత పతనావస్థను తీసుకొస్తోంది.