ఫామ్‌హౌస్ వ్యవహారం పూర్తిగా శాంపిలేనని ఇంకా చాలా చాలా ఉంటాయని కేటీఆర్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇంకా చాలా ఉంటాయని అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, ప్రాపగాండాను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్ లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుందని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఏవో వీడియోలు, ఆడియోలు వెలుగులోకి తేబోతున్నారని కేటీఆర్‌కు సమాచారం ఉందని భావిస్తున్నారు. బిజెపి,కాంగ్రెస్, టిడిపి, వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నారని.. కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి అంత తేలికగా వదిలి పెట్టరని కేటీఆర్‌కు క్లారిటీ వచ్చిందేమో కానీ పార్టీ నేతల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఫ్యామిలీ దావత్ అంశం చాలా చిన్న విషయమని.. అందుకే రేవంత్ కూడా పెద్దగా పట్టించుకోలేదని.. కానీ పొంగులేటి చెప్పిన బాంబులు పేలడం ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్లో హాహాకారాలే వినిపిస్తాయని కేటీఆర్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.