డిసెంబర్ పదకొండో తేదీన.. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాకపోతే… రాజకీయ సన్యాసం చేస్తానని.. ఎవరికీ కనిపించనని ప్రకటించిన కేటీఆర్‌పై… ఘాటు విమర్శలు వస్తున్నాయి. ముందుగా.. ఆ సన్యాసానికి రెడీగా ఉండాలని.. కోదండరాం లాంటి వాళ్లు సెటైర్లు వేస్తే.. ” అయ్య.. తల నరక్కుంటా.. టైపు సవాళ్లు బిడ్డ చేస్తున్నడని…” మండిపడ్డారు. తండ్రి లాగా ఆడిన మాట తప్పొద్దని చురకలంటించారు. వెనక్కు తగ్గవద్దని సలహాలిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అమెరికా నుంచి ఇక్కడికొచ్చి రాజకీయాలు చేస్తున్నవ్. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ అమెరికా వెళ్లేందుకు సిద్ధంగా ఉండు అని… కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ విరుచుకుపడుతున్నారు.
నిజానికి రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు చేస్తే… అది కాన్ఫిడెన్స్‌కు చిరునామాగా ఉండేది. కానీ.. కేటీఆర్… తాను ఎవరికీ కనిపించని.. మీడియాకు కనబడనని.. అసలు రాజకీయాల్లోనే ఉండనని చెప్పుకొచ్చారు. దీనిపైనే.. రకరకాల విశ్లేషణలలో విమర్శలు ప్రారంభించారు. ఓటమి ఖాయమయింది కాబట్టే.. మళ్లీ అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు.. కేటీఆర్ చేసే ప్రకటలన్నింటిపైనా ఇదే తరహా విమర్శలొస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. ఈ ఎన్నికలు తమకు రిఫరెండమేనని వ్యాఖ్యానించి… అందర్నీ నవ్వుకునేలా చేశారు. సాధారణ ఎన్నికలంటే.. ప్రభుత్వ పాలనపై తీర్పు లాంటిది.. ఇక రిఫరెండమేమిటని.. రేవంత్ రెడ్డి లాంటి నేతలు.. కేటీఆర్ అవగాహనా రాహిత్యాన్ని ఘాటుగానే విమర్శించారు.
తాజాగా.. పొత్తులో భాగంగా… కోదాడ సీటు కాంగ్రెస్‌కు పోవడంతో.. అక్కడి టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ ను టీఆర్ఎస్లో చేర్చుకున్న సందర్భంగా.. కేటీఆర్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ప్రతి రోజు చేరికలు జరుగుతుంటే గాంధీ భవన్‌కు మాత్రం బౌన్సర్లు కాపలా ఉన్నారని విమర్శించారు. దీనిపై కూడా… కాంగ్రెస్ నేతలు సెటర్లు వేస్తున్నారు. ఓటమి ఖాయమని తేలిన పార్టీ దగ్గరకు ఎవరు వస్తారని.. గెలిచే పార్టీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు అంత డిమాండ్ ఉందని… అంటున్నారు. మొత్తానికి కేటీఆర్ … హడావుడిగా చేసే విమర్శలతో.. కాంగ్రెస్ నేతలకు ఈజీగా దొరికిపోతున్నారు.