వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే డైరెక్టర్ రాంగోపాల్ వర్మని బట్టలూడదీసి కొడుతామని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించారు. జగన్ కు ఏదో అన్యాయం చేసేశారని సింపతీ కోసం ఆర్జీవీ రెండు సినిమాలు తీస్తున్నారు. అందులో ఆయనకే ఎవరెవరో కుట్రలు చేశారని చెప్పేందుకు తాపత్రయ పడుతున్నారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత సెంటిమెంట్ కోసం సోనియాపై కూడా ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్యకు కుట్ర చేశారన్నారు. తర్వాత రిలయన్స్ నిందలేశారు. సోనియా పదవి ఇవ్వకపోవడంతో బయటకు వచ్చారు. రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ పదవి ఇచ్చారు.
అయితే మళ్లీ ఎన్నికలు వస్తూండటంతో సానుభూతి పోర్న్ సినిమాల వైపు టర్న్ అయిపోయిన ఆర్జీవీతో రెండు సినిమాలు తీయిస్తున్నారు. కొండా మురళి జీవిత చరిత్రను కొండా పేరుతో తీసి వాళ్లను నిండా ముంచారు. వాళ్లకు ఉన్న పేరు ప్రతిష్టల్ని కూడా నేలబారు చేశారు. ఇప్పుడు వ్యూహం పేరుతో ఆయన రిలీజ్ చేసిన టీజర్ లో జగన్, భారతి కలిసి ఏదో ప్లాన్ చేసినట్లుగా అభిప్రాయం కల్పించేలా టీజర్ కట్ చేశారు. ఇందులో నేరుగా చంద్రబాబు పేరు ప్రస్తావించారు. సోనియా గాంధీ పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.
ఈ క్రమంలో టీజర్‌పై స్పందించిన గిడుగు రుద్రరాజు . వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే ఊరుకునేది లేదని, తప్పుగా చూపిస్తే వర్మను బట్టలుడదీసి కొడుతామని హెచ్చరించారు. అసలు వాస్తవాలు వర్మకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీని తప్పుగా చూపిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఊరుకునే అవకాశం లేదు. ఆర్జీవీ తెలంగాణలోనే ఉంటారు. అందుకే .. సోనియా గాంధీ పాత్ర గురించి క్లారిటీ గురించి కాంగ్రెస్ శ్రేణులు క్లారిటీ కోసం చూస్తున్నాయి.