గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై పోలీసులు డొంక తిరుగుడుగా ఆయనకే క్లీన్ చిట్ ప్రయత్నం చేసినా…ఏపీ పరువు మాత్రం దేశవ్యాప్తంగా రోడ్డున పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ … లోక్‌సభ స్పీకర్, మహిళా కమిషన్ చైర్మన్‌కు లేఖలు రాశారు. ప్రధానికి కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్ తీరు ఎంపీలకు మాయని మచ్చలా ఉందని లేఖలో తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలిపై చర్యలు తీసుకోవాలన్నారు. గోరంట్ల మాధన్ చేసిన పనితో ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
వైఎస్ార్‌సీపీ ఎంపీ భరత్.. గోరంట్ల మాదవ్ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపామని చెబుతున్నారని అలాంటిదేమీ లేదని మళ్లీ చెబుతున్నారని.. గుర్తు చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం విచారణ జరిపించాలని.. పార్లమెంట్ ఔన్నత్యం కాపాడాలని కోరారు. ఈ లేఖను వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ మీడియాకు చూపించారు. ఇప్పటి వరకూ తనను విమర్శించిన వారిపై గోరంట్ల మాధవ్ బూతులతో విరుచుకుపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలపైనా అదే విధంగా మాట్లాడారు. మీడియాపైనా విరుచుకుపడ్డారు. రఘురామకృష్ణరాజనూ వదల్లేదు. ఇప్పుడుతనపై ఫిర్యాదు చేసిన పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్‌పై గోరంట్ల మాధవ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తనకు వచ్చిన భాషలో బండ బూతులు పార్లమెంట్లో తిడతారో.. రఘురామను బెదిరించినట్లుగా బెదిరిస్తారో చూడాలన్న వ్యాఖ్యలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.