నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. కాంగ్రెస్ వర్గాల్లో జానారెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. జానారెడ్డి కొడుకు రఘువీర్ కి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు మాత్రం జోరుగా చేస్తున్నారు . ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే నిబంధన ఉంది. కానీ కొన్ని సార్లు వెసులుబాటు కూడా ఉంటుంది అని జానారెడ్డి చెప్తున్నారు. ఆఖరివరకు ప్రయత్నాలు చేస్తున్నారు జానా. కాంగ్రెస్ కి ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్నదే ముఖ్యం..కానీ ఎవరూ పోటీ చేస్తున్నారు అన్నది అప్రస్తుతం అంటున్నారాయన.
ఒకవేళ టికెట్ జానా రెడ్డి కొడుకు టిక్కెట్ రాని పక్షంలో ఎవరికి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఇటీవలే టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కండువా కప్పుకున్న అమరేందర్ రెడ్డి కి టికెట్ ఇప్పిస్తారా అనే చర్చ ఉంది… అమరేందర్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థి అవుతారని చెప్తున్నారు. మరో వైపు మిర్యాలగూడ సీటు మరో వైపు జనసమితి కూడా ఆశిస్తోంది. విద్యాధర్ రెడ్డి చాలా కాలంగా అక్కడ పనిచేసుకుంటున్నారు. అయితే… విద్యాధర్ రెడ్డి కాకుండా..తెలంగాణ జేఏసీలో పని చేసిన రాజేందర్ రెడ్డి కూడా ఇక్కడే సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అటు కాంగ్రెస్.. ఇటు జనసమితి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గెలుపు..ఓటముల కంటే ముందే అభ్యర్థుల ఎంపీకే అసలు సవాల్ గా మారింది. మిర్యాలగూడ బరిలో ఎవరున్నా జానా రెడ్డి కి మాత్రం ప్రతిష్టాత్మకమే… తనను కాదని వెళ్లిన అనుచరుడు భాస్కరరావును ఓడించి తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని పట్టుదలతో ఉన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలదెప్పుడూ ధిక్కార స్వభావమే. 1978నుంచి 2014వరకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులనే ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. ఒక్క ఎన్నిక మినహా ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకొస్తే మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గెలుపొందుతూ వచ్చారు. మిర్యాలగూడలో గెలిచే పార్టీ .. అధికారంలోకి రాదన్న మూఢనమ్మకం ఉంది.