నిన్నగాక మొన్న పార్టీలో చేరిన పొంగులేటికి కాంగ్రెస్ పార్టీ పదవి ప్రకటించింది. తెలంగాణ. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డని నియమిచారు. చైర్మన్ గా గతంలో కూడా మధు యాష్కీ ఉన్నారు. ఇక ముందు కూడా ఆయన కొనసాగుతారు. 37మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటిచారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది.
ఖమ్మంలో కాంగ్రెస్ రాత మారుస్తారని పొంగులేని .. బతిమాలి మారీ పార్టీలో చేర్చుకున్నారు . ఇప్పుడు ఆయన పాత కాంగ్రెస్ నేతలందర్నీపక్కన పెట్టి తన వర్గం వారికి టిక్కెట్లు ఖరారు చేసుకుంటారన్న ఆందోళనలో క్యాడర్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే ఆయన డిమాండ్లకు అంగీకరించి మరీ పార్టీలో చేర్చుకున్నందున ప్రాధాన్యత కల పదవుల్నే ఇస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ లో అసంతృప్తి పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.
జూపల్లి కృష్ణారావు ఇరవయ్యో తేదీన కాగ్రెస్ లో చేరనున్నారు. కొల్లాపూర్ లో బహిరంగసభ ఏర్పాటు చేసి ప్రియాంకా గాంధీని ఆహ్వానంచారు. ఆమె సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వరంగల్ లో బీసీ సదస్సు నిర్వహిచాలని ఇప్పటికే ఏర్పట్లు ప్రారంభిచారు.