వరంగల్ ఉప ఎన్నికలలో సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ నిన్న రాత్రి ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనం అవడంతో, ఈ పరిస్థితుల్లో రాజయ్య వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదు. పైగా నామినేషన్లు వేయడానికి ఇవ్వాళ్ళే చివరి రోజు. సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సమయం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ రాజయ్య స్థానంలో మరొకరిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి మొదటి నుంచి ఉత్సాహపడుతున్న సర్వే సత్యనారాయణ పేరు మళ్ళీ పైకి వచ్చింది. అలాగే డా. విజయ రామారావు, వరంగల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నెమళ్ళ శ్రీను పేర్లను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తోంది. మరి కొద్ది సేపటిలోనే వారిలో ఎవరో ఒకరి పేరు ఖరారు చేయవచ్చును.
వరంగల్ నుంచి పోటీ చేయబోతున్నందుకు ఇంతవరకు చాలా హుషారుగా ఉన్న రాజయ్య ఇప్పుడు తన ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన కొడుకు అనిల్ పై సెక్షన్ 498 క్రింద కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు.