నాగార్జున సాగర్ ఉపఎన్నికకు అభ్యర్థి కోసం అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుకుంటున్నాయి. వారితో పాటు అభ్యర్థిత్వం కోసం పోటీ పడే వారు కూడా.. తమ శక్తివంచన లేకుండా విభినన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కానీ ఏ ఒక్క పార్టీకి అభ్యర్థి ఖరారు కాలేదు. అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అన్న విషయం మాత్రం క్లారిటీ ఉంది. కానీ జానారెడ్డి కూడా అప్పుడప్పుడు కుమారుడి పేరును తలుస్తున్నారు. వీలైనంత వరకూ ఆయన కుమారుడ్ని పోటీకి పెట్టాలని అుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల కోంస వేట సాగిస్తున్నాయి. ఇందుల ోటీఆర్ఎస్ తరపున పోటీ చేయేడానికి ఎక్కువ మంది ఉండగా.. వారిలో ఓ బలమైన అభ్యర్థిని వల వేసి పట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ హిట్ లిస్ట్‌లో తేరా చిన్నపరెడ్డి అనే నేత ఉన్నారు.
ఆర్థికంగా బలమైన నేత కావడం.. గతంలో టీడీపీ తరపున పోటీ చేసి.. జానారెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయిన సానుభూతి కూడా ఉండటంతో ఈ సారి బీజేపీ తరపున మంచి అభ్యర్థి అవుతారని అనుకున్నారు. వెంటనే.. ఎలా పుట్టాయో కానీ ఆయన బీజేపీ నేతల్ని కలిసి.. టిక్కెట్ అడిగారనే ప్రచారం ప్రారంభమయింది. ఆయన మాత్రం తీరిగ్గా స్పందించారు. తాను ఎవర్నీ కలవలేదని చెబుతున్నారు. అంతటితో వదిలి పెట్టలేదు. సాగర్ టిక్కెట్ పై తనకు ఎంతో ఆసక్తి ఉందని ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెబుతున్నారు. టీఆర్ఎస్ కూడా.. నోముల కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వాలని అనుకోవడం లేదు.
బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపాలనుకుంటోంది. వారి జాబితాలో చిన్నపరెడ్డి కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. బీజేపీకి అక్కడ స్వతహాగా బలం లేదు. బీజేపీలో చేరే అభ్యర్థితోనే బలం రావాల్సి ఉంది. అలాంటి అభ్యర్తి కోసం వెదుకుతున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అనసరించిన వ్యూహంలాగే… టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారు చేసుకున్న తర్వాత అసంతృప్తితో ఎవరైనా ముఖ్య నేత బీజేపీలో చేరితే.. ఆయననే పోటీ పెట్టినా ఆశ్చర్యం ఉండదు. బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే… విజయశాంతి^పేరును కూడా ప్రచారంలోకి తీసుకొచ్చేశారు.