వైసీపీ ప్లేసును ఆక్రమించాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయంగా మారాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే వైసీపీపై ఎదురుదాడి ప్రారంభించిన కాంగ్రెస్.. ప్రణాళికబద్దంగా వైసీపీని బలహీనపరచాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ టాస్క్ లో షర్మిల దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ నేతలు సైతం ఆమెను ఫాలో అవుతున్నారు.
జగన్ టార్గెట్ గా షర్మిల చేసిన వ్యాఖ్యలపై… వైసీపీ నేతలు చర్చకు వచ్చే దమ్ముందా అంటూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సవాల్ చేశారు. షర్మిల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, చంద్రబాబుతో ముడిపెట్టి విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. ఆమె వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా ఎందుకు నిర్వహించలేదని జగన్ ను ప్రశ్నిస్తే ఈ విషయంపై సమాధానం ఇవ్వకుండా.. ఇతర విషయాలను తెరమీదకు తీసుకొచ్చి విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు.
వైఎస్సార్ తో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను గట్టిగా తాకినట్టు ఉన్నాయి. ఈ విషయంపై స్పందిస్తే జనాల్లోకి షర్మిల చేసిన వ్యాఖ్యలు మరింతగా వెళ్తాయని వ్యూహంతోనే ఆ వ్యాఖ్యలపై స్పందించకుండా, ఇతర విషయాలపై మాత్రమే మాట్లాడారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయంలో వైసీపీని వదిలేదని ఫిక్స్ అయినట్లు ఉన్నారు.
తాజాగా వైసీపీపై మస్తాన్ వలీ నిప్పులు చెరిగారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుంటున్నారు. ఈ విషయంపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే కాంగ్రెస్ కు అంత లాభం జరుగుతుందని, వైసీపీకి అంతే మొత్తంలో మైనస్ అవుతుందని లెక్కలతోనే కాంగ్రెస్.. వైఎస్ పేరుతో జగన్ పై ఫయర్ అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.