అది 2004 ఎన్నికలు. చంద్రబాబుకు మూడోసారి తిరుగులేదనుకునే పరిస్థితి. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున.. ఉమ్మడి రాష్ట్రంలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. అప్పటికి విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టి.. విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు… ఈ హామీని ఇవ్వడానికి వెనుకాడారు. ఫలితంగా ఉచిత్ విద్యుత్ బంపర్ హిట్ అయింది. వైఎస్‌కు విజయం తెచ్చి పెట్టింది. రాజకీయాల్లో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే.. ఒక్క హామీ చాలు రాజకీయ పార్టీ రాత మార్చేస్తుంది. త ఎన్నికల్లో అటు.. తెలంగాణలో.. ఇటు ఏపీలోనూ.. రుణమాఫీ హామీలే… ప్రస్తుత అధికార పార్టీల గెలుపునకు ప్రధాన కారణం. ఈ సారి ప్రతిపక్ష పార్టీగా ఈ చాన్స్ కాంగ్రెస్ పార్టీ అందుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా రూ. రెండు లక్షల రుణమాఫీని ప్రకటించారు. అదీ కూడా ఒకే సారి చేస్తామంటున్నారు.
రాహుల్ దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తానంటున్నారు. ఈ విషయంలో.. ఎవరిపై లేనంత నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. ఎందుకంటే.. 2009 ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ చేసింది. దాదాపుగా 70 వేల కోట్లు మాఫీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేయాలంటే.. ఆర్బీఐ అడ్డంకులు సృష్టిస్తుందేమో కానీ.. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటే.. సులువైన మార్గాలు చెబుతుంది. అదే రాహుల్‌కు అడ్వాంటేజ్ అవుతోంది. నిజానికి ఇలాంటి హామీల విషయంలో .. ప్రతిపక్ష పార్టీలేకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదీ కూడా ముందు ప్రకటించిన వారికే ప్రజల్లో క్రెడిబులిటి ఉంటుంది. ఇంత కాలం అధికారంలో ఉండి చేయలేదు కదా.. అన్న ఫీలింగ్ అధికార పార్టపై వస్తుంది. అదే పరిస్థితి .. తర్వాత ప్రకటించినా వస్తుంది. ఈ అడ్వాంటేజ్ ను కాంగ్రెస్ పకడ్బందీగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది.
రైతుల కుటుంబాల్లోకి ఈ రుణమాఫీ అంశం చురుగ్గా తీసుకెళ్లగలిగితే.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్న అంచనా ఆ పార్టీ నేతల్లో ఉంది. కచ్చితంగా ప్రభావం ఉంటుంది కాబట్టే.. కేసీఆర్ కూడా.. తన పాక్షిక మ్యానిఫెస్టోలో రూ.లక్ష రుణమాపీ ప్రకటించారు. కానీ ఆ విషయంలో… రైతులెవరూ.. పెద్దగా నమ్మకం పెట్టుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీ.. దక్కించుకున్న వారు ఊరికి ఒక్కరు కూడా లేరు. అందుకే.. ఈ సారి కాంగ్రెస్ పార్టీపైనే రైతులు.. వారి కుటుంబాలు.. ఎక్కువ నమ్మకం ఉంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయనేది.. తెలంగాణ రాజకీయవర్గాల అభిప్రాయం.