మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత డీఎస్ ( ధర్మపురి శ్రీనివాస్ ) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.డి శ్రీనివాస్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సంతాపాన్ని తెలియజేశారు.
డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. విద్యార్ధి సంఘ నాయకుడుగా రాజకీయాల్లోకి వచ్చిన డీఎస్.. . ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ కోసం ఆయన నిబద్దతను గుర్తించిన అధిష్టానం 1989లోనే నిజామాబాద్ అర్బన్ టికెట్ కేటాయించగా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన డీఎస్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. సోనియా గాంధీకి వీరవిధేయుడిగా గుర్తింపు పొందారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2015లో బీఆర్ఎస్ లో చేరారు. ఆయన సీనియార్టీ దృష్ట్యా డీఎస్ ను బీఆర్ఎస్ రాజ్యసభకు పంపింది. ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో 2023లో మళ్లీ కాంగ్రెస్ లో చేరిన డీఎస్…పార్టీలో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా విడుదల చేసి షాక్ ఇచ్చారు.
డీఎస్ మరణంపై ఆయన రెండో కుమారడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ గా స్పందించారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ!.. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.