కర్ణాటకలో బలపరీక్షకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ.. కాంగ్రెస్ – జేడీఎస్ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి దేశం మొత్తం నుంచి ప్రాంతీయ పార్టీలన ఆహ్వానించి ఘనంగా జరిపారు. ఇప్పుడు బలపరీక్షలో తేడాలో వస్తే.. నవ్వేటోడి ముందు జారిపడినట్లవుతుంది పరిస్థితి. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను.. ఇంకా రిసార్టుల్లోనే ఉంచాయి. కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార్ అసంతృప్తి… అటు కాంగ్రెస్ ఇటు జేడీఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంద.ఉప ముఖ్యమంత్రి పదవి ఆశించిన శివకుమార్ కు…హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. మొన్న ఎమ్మెల్యేల క్యాంప్.. గుజరాత్ లో రాజ్యసభ ఎమ్మెల్యేల క్యాంప్ ను బెంగళూరులో నిర్వహించి శివకుమార్ హైకమాండ్ దృష్టిలో పడ్డారు.
కానీ ముఖ్యమంత్రి కుమారస్వామి, శివకుమార్ ఇద్దరూ వక్కళిగలే కావడంతో… సామాజిక సమీకరణాలు కలసి రాకపోవడతో.. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వలేదు. అయినా తనను కనీసం తనను పిలిచి మాట్లాడలేదని ఆయన అలిగారు.శివకుమార్ కు మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పైగా పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉండే పరమేశ్వరకు డిప్యూటీ సీఎం ఇవ్వడం కూడా ఆయనకు నచ్చలేదు.
కాంగ్రెస్ లోని లింగాయత్ సామాజికవర్గం ఎమ్మెల్యేలు తమకు ఓ డిప్యూటీ సీఎం కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో 16 మంది లింగాయత్ ఎమ్మెల్యేలున్నారు. కర్ణాటకలో మొత్తం 34 మంది మంత్రులు ఉండొచ్చు. అందులో 22 మంది కాంగ్రెస్ వారు. 12 మంది జేడీఎస్ వాళ్లు ఉండాలని తీర్మానించారు. ఇప్పటికే కాంగ్రెస్ తరపున ఉప ముఖ్యమంత్రి పదవి ఖరారు కావడంతో మిగిలిన 21 మందిలో ఎంత మంది లింగాయత్ లకు అవకాశం ఇస్తారో చూడాలి. అయితే విశ్వాస పరీక్ష పూర్తయ్యే లోపు దీనిపై తేల్చాలని లింగాయత్ లు కోరుతున్నారు.
ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారని.. ఎమ్మెల్యేలను వదిలేస్తే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారని అమిత్ షా స్వయంగా ప్రకటించడం కాంగ్రెస్ – జేడీఎస్ కు గుబులు రేపుతోంది. 90 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జేడీఎస్ తో కలవడం ఇష్టం లేదని యడ్యూరప్ప చెబుతున్నారు. అయితే బీజేపీ స్వయంగా ఏ రాజకీయం చేసే అవకాశాల్లేవంటున్నారు. ఇప్పటికే చెడ్డపేరు వచ్చినందున… విశ్వాస పరీక్ష సమయంలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.