తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా వీక్ అనుకుంటే.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బాట్స్ ను.. పెట్టుకుని దడదడలాడిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్
పార్టీ ఎవరి పాలన బాగుందని ఓ పోల్ పెట్టింది. సహజంగానే ఇది కాంగ్రెస్ పోల్ కాబట్టి కాంగ్రెస్ సానుభూతిపరులు ఓట్లేస్తారు. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఓట్లేశారు. అయితే చూసి చూసి బీఆర్ఎస్ సోషల్ మీడియా .. కాంగ్రెస్ వాళ్లు పట్టించుకోనప్పుడు.. పోల్ ముగిసే ముందు ఓ యాభై వేల ఓట్లను వేయించేసింది. దాంతో కాంగ్రెస్ సోషల్ మీడియాకు కక్కలేని మింగలేని పరిస్థితి.
ఈ పోల్ రిజల్ట్ చూపించి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా కవర్ చేసుకోవడం ప్రారంభిచారు. అమెరికాతో పాటు విదేశాల నుంచి ఆపరేట్ చేసి బాట్స్ ద్వారా ఓట్లు వేయించిందని నిమిషాల వ్యవధిలోనే పెరిగిపోయిన ఓట్లును చూపించి విమర్శించడండ ప్రారంభించింది. దీంతో కాంగ్రెస్ కవర్ డ్రైవ్ లు ప్రారంభించింది. బీఆర్ఎస్ బాట్స్ ను ఎక్స్ పోజ్ చేయడానికే తాము ఈ పోల్ పెట్టామని బయట పెట్టామని అంటున్నారు.
నిజానికి సామాన్యులకు ఈ పోల్స్. బాట్స్ గురించి తెలియదు. వారు రిజల్ట్ చూస్తారు. ఇప్పుడు ఆ రిజల్ట్ ను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. బీఆర్ఎస్ అలా చేస్తుందని తెలిసినప్పుడు కౌంటర్ తాము కూడా బాట్స్ ను మాట్లాడుకుని ఓట్లు పెంచుకోవాల్సింది. ఆ పని చేయలేక.. బీఆర్ఎస్ ను ఎక్స్ పోజ్ చేశామంటే.. అంతా ఓడిపోయాక.. మీ తొండాటను బయట పెట్టామని చెప్పినట్లుగా ఉంటుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ పోల్ చెబుతోంది.