కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓటు బ్యాంక్ ఉందని … ఆ. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించేంత రేంజ్ ఆమెకు లేదని జగన్ తేల్చేశారు. ఇన్ సఫిషియంట్ అని చెప్పడానికి మూడు సార్లు తడబడినా చెప్పారు. కాంగ్రెస్ గురించి.. షర్మిల గురించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచిత్రమే. ఎదుకంటే ఆయన ఇప్పుడు ఇన్ సఫిషియంట్ పొజిషన్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాదు.
ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల ఓ సూటి ప్రశ్న అడిగారు. అసెంబ్లీకి వెళ్లానే కదా ప్రజలు ఓట్లేసింది.. ఎందుకు వెళ్లరు ?. వెళ్లకపోతే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. షర్మిల కాదు ఎవరు అడిగినా దానికి సమాధానం చెప్పాల్సిన ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఇండివిడ్యూవల్ కూడా ప్రతి రాజకీయ పార్టీని .. ప్రశ్నించడానికి సఫిషియంటే. వైసీపీ మార్క్ లో బూతులతో ప్రశ్నించడం కాదు. విధానాలను ప్రశ్నించడం.
షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ రెడ్డి ఇలా తప్పించుకునే ప్రయత్నం చేశారు. తాను చెల్లిని .. ఓ పార్టీ అధ్యక్షురాలిని అవమానించేశానని ఆయన అహం తృప్తి డి ఉండవచ్చు కానీ..ఆయన సమాధానాన్ని చూసిన వారు మాత్రం.. ఇంత అహంకారంతో ఇంకెంత పాతాళానికి పడిపోతారో అని అంచనా వేసుకుంటున్నారు. షర్మిల ఇప్పుడు తన రాజకీయం తాను చేస్తున్నారు. ఆమెను ఆ విధంగానే గౌరవించాల్సి ఉంది. ఇలా అవమానించేస్తున్నానని సంతోపడితే రేపు ఆ పరిస్థితి జగన్ కే వస్తుంది. ఎందుకంటే… వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీదే.