ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక నిజంగానే కుట్రకోణం ఉందా? ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయలనే పడవలను గాలికి వదిలేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అవును.. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పడవలు బ్యారేజీ గేట్లను డీకొట్టి గేట్లు దెబ్బతింటే , ప్రభుత్వాన్ని బద్నాం చేయవచ్చునని ఎజెండాతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పడవల్ని గట్టిగా లంగరేసి కట్టాలని హెచ్చరించినా వాటి యజమానులు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రమాదం జరుగుతుందని చెప్పాక కూడా వాటిని అలాగే ఎందుకు వదిలేసినట్లు?పైగా ఉద్దండరాయునిపాలెం వైపు ఉన్న పడవలను గొల్లపూడి వైపు ఎందుకు తెచ్చి పెట్టారు..? వరద ఉధృతికి కొట్టుకుపోయి బ్యారేజ్ గేట్లను డీకొట్టడంతో గేట్లు దెబ్బతింటాయని ప్లాన్ తోనే ఇదంతా చేశారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇక, ఇటీవల భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా డీకొట్టిన మూడు పడవల్లో రెండు వక్కలగడ్డ ఉషాద్రివి. ఈయన మరెవరో కాదు..సూరయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ కు ప్రధాన అనుచరుడు.జగన్ కు అత్యంత సన్నిహితుడైన తలశిల రఘురాంకు రామ్మోహన్ దగ్గరి బంధువు కావడం గమనార్హం. ఈ సాన్నిహిత్యంతోనే ఉషాద్రి మాజీ ఎంపీ నందిగం సురేష్ తోపాటు కోమటి రామ్మోహన్ లారీలకు ఇసుక సరఫరా చేసేవారని సమాచారం. దీంతో ఉషాద్రి, రామ్మోహన్ లను అదుపులోకి తీసుకొని వారి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.