టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును, లోకేష్ ను, ఆయన కుటుంబాన్ని ఎన్ని తప్పుడు కేసులతో ఎంత టార్చర్ పెట్టారో అందరికీ తెలుసు. వారిని తమ ఫ్యామిలీలా ఫీలైపోయిన కార్యకర్తలంతా రగిలిపోయారు. అందుకే లోకేష్ రెడ్ బుక్ అనగానే ఖచ్చితంగా చట్టపరంగా అయినా సరే చర్యలుంటాయని నమ్మకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అాలా కుట్రలు చేసిన వాళ్లే బోకేలతో లోకేష్ తో ఫోటోలు సోషల్‌మీడియాలో పెడుతూంటే… కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు.
ఫైబర్ గ్రిడ్ అనే దాంట్లో స్కామ్ లేదు. ఓ నేరెటివ్ సృష్టించారు. దాన్ని అమలు చేసింది గౌరీశంకర్ అనే ఫ్రాడ్‌స్టర్ చేతుల మీదుగా. ఆయనకు దొంగ సర్టిఫికెట్లతో పదవి కూడా జగన్ ఇచ్చారు. తర్వాత తీశారు. ఆయన… టీవీల్లో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, లోకష్ పై ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి ఆరోపణలు చేశారు. ఆయన చెప్పినవే ఎక్కువ కోర్టుల్లో చెప్పింది సీఐడీ. ఆయన హఠాత్తుగా లోకేష్ కు పెద్ద బోకే ఇచ్చి.. వికటట్టాహాసం చేస్తున్నట్లుగా నవ్వతూ ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.
ఆ ఫోటో చూసి.. ఫైబర్ గ్రిడ్ కేసు ను ఫాలో అయిన వారంతా ఆశ్చర్యపోయారు. లోకేష్ వద్దకు వందల మంది వస్తారని ఆయనెవరో తెలియదని కొంత మంది అనుకున్నారు కానీ.. అలా ఎలా రానిస్తారు.. కనీసం వచ్చే వారెవరో బ్యాక్ గ్రౌండ్ చెక్ కూడా చేయరా అనేది ప్రధాన ప్రశ్న. ఇలా ఫీలయ్యేవారికే అంతా తెలుసు.. లోకేష్ కేం తెలియదని మరికొంత మంది సెటైర్లు వేస్తారు.. ,.కానీ కార్యకర్తల మనోభావాలు అలా ఉండటంలేదు. ఇలాంటి వారిని కలిస్తే కనీసం ఫోటోలు బయటకు రాకుండా చూసుకుంటే బెటర్. లేకపోతే.. కుట్రలు చేసినోళ్లను క్షమించేస్తున్నారని.. వారికే ప్రాధాన్యమిస్తున్నరని క్యాడర్ ఫీలయ్యే ప్రమాదం ఉంది.