ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. అయితే.. విచారణ చేపట్టిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది.అయితే అనూహ్యాంగా జస్టిస్ యూయూ లలిత్ తాను విచారణ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. గతంలో తాను ఒకరి తరఫున న్యాయవాదిగా వాదనలు వినిపించానని.. అతను ప్రస్తుతం ఈ కేసులో పార్టీగా ఉన్నారని.. ఇందులో తన ప్రమేయం లేకుండా తీర్పు రావాల్సి ఉందని.. అందుకే ఈ కేసు విచారణ తన అధ్వర్యంలో జరగడం సరికాదని భావించినట్లు జస్టిస్ లలిత్ పేర్కొని ధర్మాసనం నుంచి వైదొలిగారు.
జస్టిస్ యూయూ లలిత్ గతంలో జగన్మోహన్ రెడ్డి తరపున కొన్ని కేసులు వాదించారు. అందుకే… కేసు ధర్మాసనం నుచి తప్పుకున్నట్లుగా ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపై అనేక ఆరోపణలు చేస్తూ.. జగన్ ఓ లేఖ రాశారు. దాన్ని చీఫ్ జస్టిస్‌కు పంపారు. అయితే.. మూడు రోజుల తర్వాత ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి దాన్ని విడుదల చేశారు. న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ చీఫ్ జస్టిస్‌కు లే్ఖ రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేసి … కోర్టు ధిక్కరణకు జగన్ పాల్పడ్డారని..ఇది న్యాయవ్యవస్థను బలహీనం చేసే చర్య అని.. విమర్శలు వచ్చాయి. అడ్వకేట్లు సునీల్ కుమార్ సింగ్, జీఎస్ మణి కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు.
ఆ పిటిషన్లపై విచారణజరిపి.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందా రాదా, దీని ఆధారంగా జగన్‌కు సీఎం పదవి నుంచి తప్పించాల్సి వస్తుందా లేదా అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీజేఐ ఎస్ఏ బాబ్డేతో సంప్రదించిన తరువాత ఈ కేసును తగిన బెంచ్‌కు లిస్ట్ చేసే అవకాశం ఉంది.