హైదరాబాద్: అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖిల్’ ఆడియో విడుదల సందర్భంగా ఒక ట్రైలర్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌పై ఇప్పుడు వివాదం ఏర్పడింది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోలేకపోయింది. దీనిని అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యూట్యూబ్‌లో ‘డిస్లైక్’లు కొడుతున్నారు. మరోవైపు ఈ ట్రైలర్ రూపొందించిన రమా రాజమౌళి కుమారుడు కార్తికేయపై మండిపడుతున్నారు. నాగార్జున బర్త్‌డే విడుదల సందర్భంగా విడుదలైన అఖిల్ టీజర్ బ్రహ్మాండంగా ఉండగా, ఈ ట్రైలర్ ఆ స్థాయిలోకూడా లేదని, సినిమాపై ఆసక్తి తగ్గించేలా ఉందని అంటున్నారు.
మరోవైపు అఖిల్ ఆడియో విడుదలకు సంబంధించి మహేష్ తదితరులకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేస్తూ, చిత్రం ప్రోమోల ఫుటేజ్ వెనక ఉన్న ఉన్న వ్యక్తి కార్తికేయ అని చెప్పారు. అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కార్తికేయ బాహుబలి చిత్రానికి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇతనికి షోయింగ్ బిజినెస్ అనే కంపెనీ ఉంది. బాహుబలి చిత్రంతోబాటు మనం, ఊహలు గుసగుసలాడే, ఒక లైలాకోసం చిత్రాల మేకింగ్ వీడియోస్, పోస్టర్ డిజైనింగ్ ఇతని సంస్థే చేసింది. ఈ కంపెనీకే అఖిల్ సినిమా పబ్లిసిటీ మెటీరియల్ డిజైన్ బాధ్యతలు అప్పగించారు.
[youtube http://www.youtube.com/watch?v=eyINnOtCQ7A&w=640&h=360]