అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ 21వ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు ఆహ్వానం పంపిందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 18న ఈ కార్యక్రమం జరగనున్నది. గడచిన పదేండ్లలో తెలంగాణ సాధించిన వృద్ధిలో కేటీఆర్ ప్రభావవంతమైన నాయకత్వం, రాష్ర్టాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చిన తీరు తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
కానీ అది వ్యక్తిగతంగా అందిన ఆహ్వానం కాదని.. తెలంగాణ ఐటీ మంత్రిగా వచ్చిన ఆహ్వానమని కాంగ్రెస్ నేతలు కొత్తగా రివర్స్ ప్రారంభించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ గొప్పలకు బ్రేక్ పడిందిని చెబుతున్నారు. హార్వర్డ్ నుంచి కేటీఆర్ కి అందిన ఆహ్వానంలో కేటీఆర్ ను ఐటీ మంత్రిగా పేర్కొన్నారు. కేటీఆర్‌ను ఇంకా ఐటీ మంత్రిగా అనుకుంటున్నారని.. మంత్రి కాబట్టే ఇన్నాళ్లు పిలుపులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. హార్వర్డ్ పిలుపుతో ఇప్పుడు అసలు విషయం తేలిపోయిందని విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వానికి వచ్చే ఆహ్వానాలను.. ఇన్నాళ్లు వ్యక్తిగత క్రెడిట్ తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. హార్వర్డ్ వాళ్లకు కేటీఆర్ మాజీ అయ్యారని తెలీదా? సోషల్ మీడియా అని సోషల్ మీడియా వేదికగా.. హార్వర్డ్, కేటీఆర్‌లను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఈ హార్వార్డ్ మీటింగ్ కు హాజరైతే .. వ్యక్తిగతంగా ఆహ్వానం వచ్చినట్లే అనుకోవచ్చు.