చంద్రబాబు మీద కేసులు పెట్టేందుకు స్టేషన్లకు వస్తున్న వైసీపీ నేతలు.. కార్యకర్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న పోలీసులు.. అదే అంశంపై మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిపై ఏమని కేసులు పెడతారు..? పోలీసులు తల్చుకుంటే ఎలాంటి కేసులైనా పెట్టగలరు..?. పైగా ఇది పానడమిక్ సమయం. అదే అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. గుంటూరు పోలీసులు ఈ విషయంలో మరీ అడ్వాన్స్‌గా ఉండిపోయారు.
నలుగు టీడీపీ నేతలు వెళ్లి మంత్రి అప్పలరాజు కరోనా కొత్త స్ట్రెయిన్ గురించి మాట్లాడిన వీడియో సీడీ సహా ఇచ్చి కేసులు పెట్టాలని ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు తీసుకుని పక్కన పడేసిన పోలీసులు.. వారు వెళ్లిపోయిన తర్వాత… కరోనా నిబంధనలు ఉల్లంఘించారని రివర్స్‌లో వారిపైనే కేసులు పెట్టారు. దీంతో షాక్ తినడం. టీడీపీ నేతల వంతయింది. అదే పోలీస్ స్టేషన్లో.. చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే.. మీడియాకు సమాచారం ఇచ్చి మరీ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అంత కంటే స్ట్రెయిట్‌గా మంత్రిగా ఉండి మరీ.. కొత్త స్ట్రెయిన్ గురించి చెప్పిన అప్పలరాజుపై ఫిర్యాదు చేస్తే.. కేసు పెట్టకపోగా.. రివర్స్‌లో కేసు పెట్టారు. దీంతో ఎవరైనా అప్పలరాజుపైనా.. వైసీపీ నేతలపైనైనా ఫిర్యాదు చేస్తే.. రివర్స్‌లో కేసులు పెడతామన్న సందేశాన్ని పోలీసులు విజయవంతంగా పంపేశారు.
ఇప్పటికే పోలీసులు వైసీపీ కోసమే పని చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి చర్యలతో.. ఇక బాధితులు కూడా ఎవరూ పోలీస్ స్టేషన్‌కు రాకుండా చేస్తున్నారని.. అంతిమంగా పోలీసులపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. కానీ రాజకీయ చదరంగంలో పోలీసులు ఇప్పుడు… చట్టం.. రాజ్యాంగాలనుఅమలు చేయడం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పిందే… చట్టం… రాజ్యాంగం. అదే అమలవుతోంది.