రాజ్యసభ సీట్లు రావడం వాటిలో సగం గుజరాత్‌కో తెలంగాణకో కట్టబెట్టడం కామన్‌గా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన ఒక్కో సీటును విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు కేటాయించారు. అదికారంలోకి వచ్చాక గుంపగుత్తగా మొత్తం సీట్లన్నీ వైసీపీకే వస్తున్నా… రాజ్యసభ ఆశలు పెట్టుకున్న ఎవరికీ చాన్సివ్వడం లేదు. రేసులో చూపించి.. చూపించి చివరికి హ్యాండిచ్చేస్తున్నారు. గతంలో గుజరాత్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి చాన్సిచ్చారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యకు, లాయర్ నిరంజన్ రెడ్డికి జగన్ అవకాశాలు కల్పించారు.
టీడీపీ నేపధ్యం ఉన్న ఇద్దరికి రాజ్యసభ సీట్లు దక్కాయి. ఆర్ కృష్ణయ్య తెలంగాణలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు… రాజ్యసభ సీటు ఆఫర్ చేసి బీద మస్తాన్ రావును టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో ఉన్ నసీనియర్ నేతల సంగతేమిటి ? . ఎమ్మెల్సీ, రాజ్యసభ చాన్స్ ఇస్తామనిచాలా మంది నేతల్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు. వారంతా అవకాశాలు లేక అలా ఎదురు చూస్తున్నారు. వారిని కాదని.. ఇతరులకు జగన్ చాన్సిచ్చారు. దీంతో సహజంగానే ఆ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.
వైఎస్ఆర్సీపీ రాజ్యసభ నేతల్లో జగన్ అక్రమాస్తుల కేసుల లింకులు ఉండటాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డికి వరుసగా అవకాశాలు కల్పించడాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే అక్రమాస్తుల కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీఐ, ఈడీ కోర్టుల్లోనూ వాదిస్తున్న నిరంజన్ రెడ్డికి అవకాశం కల్పించడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అక్రమాస్తుల కేసుల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనన్న ఆరోపణలు విపక్షాల వైపు నుంచి వస్తున్నాయి.
మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీని సొంత అవసరాల కోసం వాడుకుంటున్నట్లుగా ఉంది కానీ.. అది ప్రజలు ఇచ్చిన అధికారం అని ప్రజల కోసం.. రాష్ట్రం కోసం వినియోగించాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఫలితం సొంత అవసరాల కోసమే పదవుల పంపకాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.