ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు మరణ వార్తని అధికారికంగా ప్రకటించారు తనయుడు ఎస్.పి.చరణ్. దాంతో ఏ మూలనో మిణుకుమిణుకుమంటున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. దేశాన్ని తన గానంతో ఉర్రూతలూగించిన ఓ మహాగాయకుడి మరణం సంగీత ప్రియుల్ని విషాద సాగరంలో ముంచెత్తింది. అయితే నిజానికి బాలు నిన్న రాత్రే తుది శ్వాస విడిచారని సమాచారం. ఈ విషయాన్ని డాక్టర్లు సైతం కుటుంబ సభ్యులకు చెప్పేశారని, ఆరకంగానే మీడియాకూ సమాచారం అందిందని తెలుస్తోంది. అయితే… సంప్రదాయాల్ని, ముహూర్తాల్నీ అమితంగా నమ్మే కుటుంబ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఈ మరణ వార్తని అధికారికంగా చెప్పాలని నిర్ణయించుకున్నార్ట. అందుకే.. సరిగ్గా అదే సమయానికి చరణ్ మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు సాయింత్రమే బాలు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి పొడంబాకంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు.