హైదరాబాద్‌లో ఇప్పటికి ఇరవై ఒక్క పాజిటివ్ కేసులు తేలినా.. ఇందులో అసలు మొదటి కేసులు మాత్రం ఈ రోజే బయటపడింది. హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటి వరకూ.. విదేశాల్లో వైరస్ అంటించుకుని వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారి నుంచి ఒక్కరంటే.. ఒక్కరికీ వైరస్ అంటుకున్న దాఖలాలు కనిపించలేదు. దాంతో ప్రజలంతా కాస్త భరోసాతో ఉన్నారు. ఇప్పుడది తేలిపోయింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి.. మొదటి సారి వైరస్ సోకిన ఘటన బయటపడింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని వ్యక్తికి.. విదేశాలు వెళ్లకుండా… కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అతను దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగాడు.
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడు రోజుల కిందట పాజిటివ్‌గా తేలింది. రెండు రోజులకు..అతని స్నేహితుడికి కూడా అవే లక్షణాలు బయటపడటంతో… టెస్టులు చేయించడంతో కరోనా పాజిటివ్ గా తేలింది. నిజానికి విదేశాల నుంచి వచ్చిన వారు పధ్నాలుగు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ దాన్ని పట్టించుకోకుండా.. అతను స్నేహితులతో కలిసి తిరగడంతో… అంటు వ్యాధిని వ్యాప్తి చేసినట్లయింది. కరోనా వైరస్ వ్యాప్తిలో ఇది కీలకమైన దశగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ.. విదేశాలకు వెళ్లి అక్కడ వైరస్ బారిన పడిన వారికి మాత్రం.. ఆ లక్షణాలు ఇండియాకు వచ్చిన తర్వాత బయటపడుతున్నారు. వారి వల్ల ఇతరులకు అంటుకోవడం ప్రారంభమైతే.. దాన్ని ఆపడం కష్టతరమవుతుందన్న అంచనా ఉంది.
అందుకే.. జనతా కర్ఫ్యూను మోడీ ప్రకటించారు. ఈ లోపే హైదరాబాద్‌లో ఉపద్రవం ప్రారంభమయింది. ఇప్పటి వరకూ.. దేశంలో ఇలా కరోనా పాజిటివ్‌గా తేలిన మొదటి కేసు.. హైదరాబాద్‌లోనే బయటపడింది. ఈ కేసులో ఇప్పటికి హైదరాబాద్‌లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు 21గా తేలాయి.