ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్రతం చెడినా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడింది. కరోనా విజృంంభిస్తున్న కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికి ఎన్నికలు వాయిదా పడినప్పటికీ.. కోడ్ మాత్రం అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పథకాలు కూడా.. అమలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేయాలని ఇప్పటికే.. ఎస్ఈసీ ఆదేశించింది. మార్చి 31వ తేదీలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే.. పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రూ. ఐదు వేల కోట్లు రావంటూ.. ఇరవై రోజుల్లోనే అన్నిరకాల ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం హడావుడి పడింది. దానికి తగ్గట్లుగా… ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది.
కానీ.. కేంద్రం … హై అలర్ట్ ప్రకటించడం.. సినిమా ధియేటర్లు లాంటి.. కొంత మంది గుమికూడే ప్రాంతాలను కూడా మూసేయాలని ఆదేశించడంతో.. ఎన్నికల లాంటి బిగ్ ఈవెంట్స్ ను నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. తప్పని పరిస్థితుల్లో వాయిదాకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసమే.. టెన్త్ పరీక్షలను వాయిదా వేసింది. కరోనా ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో విజృంభించకముందే.. పాత షెడ్యూల్ ప్రకారం.. టెన్త్ పరీక్షలు నిర్వహించి ఉంటే.. నెలాఖరుకు పూర్తయ్యేవి. కానీ ఇప్పుడు నెలాఖరు నుంచి ప్రారంభిస్తున్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే క్లిష్టంగా మారుతోంది.
దీంతో పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారుతోంది. అదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం 31వ తేదీలోపు బడ్జెట్ ఆమోదించుకోవాల్సి ఉంది. లేకపోతే.. ఏపీలో ఆర్థిక కార్యకాలాపాలు ప్రపంచవ్యాప్తంగా.. అనేక దేశల చట్టసభలు.. నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నింటినీ ఆపుకుని.. ఒకే సారి డెడ్లైన్ లోపు చేయాలనుకోవడంతో వ్రతం చెడినా.. ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడుతోంది.