లాక్డౌన్ సమయంలోనూ… సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వర్మ. అవి ఎలాంటి సినిమాలు? ఎవరికి నచ్చాయి? అనేది పక్కన పెడితే – క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పనైతే చేయగలిగాడు. వర్మకి చాలా పెద్ద టీమ్ ఉంది. తను సెట్ కి వెళ్లకపోయినా, షూటింగ్ సజావుగా జరిపేంత క్రూ ఉంది. వర్మనే నమ్ముకుని, సంవత్సరాలుగా వర్మతో ట్రావెల్ అవుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. వర్మ బలం, బలగం వాళ్లే.
అయితే అలాంటి టీమ్ లో ఓ కీలకమైన సభ్యుడికి కరోనా సోకినట్టు సమాచారం. దాంతో వర్మ టీమ్ అలెర్ట్ అయిపోయింది. ఎక్కడ పనులు అక్కడే ఆపేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తీస్తున్నవే. వాటి పనులన్నీ వర్మ ఇప్పుడు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. టీమ్ లోకి మిగిలిన సభ్యులకూ కరోనా టెస్టులు చేయిస్తున్నార్ట. రోగాలకూ, వైరస్ లకూ, మనుషులకూ, సమాజానికి భయపడని వర్మ టెస్టులు చేయించుకుంటాడో లేదో?