కరోనా ధర్డ్ వేవ్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ సారి ప్రత్యేక ఏమిటంటే తొలి సారి కరోనా సోకింది అనిచెప్పేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. రెండో సారి..మూడో సారి సోకినవాళ్లు కూడా ఉన్నారు కానీ.. గత రెండు వేవ్స్‌లో తప్పించుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. సెలబ్రిటీల్లో ఇలాంటి వారు ఎక్కువగా తాము కరోనా బారినప డ్డామని చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్, తెలంగాణ డీఎం హెచ్‌వో సహా పలువురు సెలబ్రిటీలు తొలి రెండు వేవ్స్ సమయంలో కరోనా బారి నుంచి తప్పించుకోగలిగారు.
కానీ ఇప్పుడు మాత్రం తప్ప లేదు. కరోనా సామాజిక వ్యాప్తి జరిగిందని వరుసగా నమోదవుతున్న కేసులు మాత్రమే కాదు… నమోదవ్వని.. ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి ఎంత మందికి సోకిందో లెక్కలు తీసుకుంటే బయటపడిపోతోంది. మొత్తంగా గతంతో పోలిస్తే ఇప్పుడు కరోనా ను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం కూడా తగ్గిపోయింది. మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్ సమయంలో అయినా శ్మశానాలు పట్టలేదు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు.
దేశంలో కొన్ని చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే.. వచ్చే సీజన్ నుంచి కరోనాను సాధారణ ఫ్లూగా భావించే అవకాశం ఉంది. ఇప్పటికే క్వారంటైన్ నిబంధనలను వారానికి తగ్గించేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వచ్చే ఆరు నెలల్లో కరోనా పరిస్థితి పూర్తిగా తగ్గిపోతుదంని.. ఫ్లూగా మారిపోతుందని అంచనా వేస్తోంది. అదే జరిగితే ఓ భయం మాత్రం ప్రపంచానికి తప్పుతుంది.