ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్‌లాక్ 3ని అమలు చేసే దిశగా కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడుతోంది. దాదాపుగా రాష్ట్రాలన్నీ.. కేంద్రం ఇచ్చే సడలింపులు అమలు చేస్తామని చెబుతున్నాయి. దీంతో కేంద్రం.. అన్‌లాక్ 3లో భాగంగా సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయింది. 25శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడుపుకునేందుకు చాన్సిచ్చి… శానిటైజేషన్ సహా అనేక నిబంధనలు పెడతరాని చెబుతున్నారు. అయితే.. సినిమా ధియేటర్ల యాజమాన్యాలు మాత్రం.. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటిస్తాం కానీ.. యాభై శాతం ఆక్యుపెన్సీకి చాన్సివ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క సినిమా హాళ్లే కాదు… జిమ్‌లను తెరిచేందుకు కూడా పర్మిషన్ ఇవ్వనున్నారు.
స్కూళ్లు, మెట్రై రైళ్లుకు అనుమతి లేదు. స్కూళ్లను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే.. అది భావి పౌరుల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో.. అన్ని రకాల పరిశీలనలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. అన్‌లాక్ 3లో మాత్రం.. స్కూళ్లు, కోచింగ్ సెంటర్లకు పర్మిషన్ లభించదు. ఇప్పటికే అన్ లాక్ 1, అన్‌లాక్ 2నిబంధనలతో సాధారణ జన జీవనం ప్రారంభమయింది. చాలా రాష్ట్రాలు.. కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల సొంతంగా లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నాయి. కేంద్రం మాత్రం.. పరిమితులు మినహాయిస్తూ పోతోంది.
నిజానికి మార్చిలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు.. వందలోపే కేసులు ఉండేవి. ఆ తర్వాత రెండు నెలల పాటు పూర్తి లాక్ డౌన్ విధించడంతో… కేసులు భారీగా పెరగలేదు. రెండు నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని… అది కూడా ముఖ్యమేనని చెబుతూ.. ఆన్ లాక్ ప్రారంభించారు. అప్పుడే వైరస్ కూడా కట్టలు తెగింది. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సరైన జాగ్రత్తలు పాటించని అనేక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అన్ లాక్ వల్లే.. కేసులు పెరుగుతున్నాయని.. అందరూ ఏకగ్రీవంగా చెబుతున్న మాట. అయినా సరే.. అన్ లాక్ త్రీని కేంద్రం అమల్లోకి తెస్తుంది. ఇది కరోనాకు మరింత ఫ్రీడం ఇవ్వమే. ప్రజలే జాగ్రత్తగా ఉండాలి..!