వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడి చేసిన కేసులు మొత్తాన్ని బయటకు తీస్తున్నారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా దాడులు చేసి.. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి అయితే.. తన అభిమానస్తులకు బీపీ వచ్చి చేశారని స్వయంగా సీఎం చెప్పుకున్నారు. కేసులుకూడా సరిగ్గా పెట్టలేదు. ఇప్పుడా దాడులన్నింటినీ బయటకు తీస్తున్నారు.
ప్రధానంగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు ఫైల్ ను రెడీ చేసినట్లగా తెలుస్తోంది. దేవినేని అవినాష్, లేళ్ల అప్పరెడ్డి రెండు గ్యాంగుల్ని వేసుకొచ్చి దాడులు చేశారు. మొత్తం దృశ్యాలు రెడీగా ఉన్నాయి. వాటి ఆధారంగా మొత్తం రెడీ చేశారు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చిన జోగి రమేష్ వ్యవహారం పై కూడా కొత్తగా బయటకు రానుంది. ఆ దాడిని చూపించి మంత్రి పదవి పొందారు. ఇప్పుడు అసలు సినిమా కనిపించబోతోంది. ఇక పట్టాభిరాం ఇంటిపై దాడి చేసిన వారు.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేయించిన వల్లభనేని వంశీ వ్యవహారం కూడా.. బయటకు తీస్తున్నారు.
అంగళ్లు దాడులతో సహా.. టీడీపీ నేతలపై దాడి చేసి.టీడీపీ నేతలపైనే పెట్టిన కేసుల గురిచి మొత్తం బయటకు తీస్తున్నారు. ఇప్పటికే అంతర్గతంగా పోలీసులు ఫైల్స్ రెడీ చేస్తున్నారు. పెద్దగా ప్రచారం లేకుండానే.. నిందితుల్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాాచారం వైసీపీ నేతలకు తెలియడంతో చాలా మంది ఆజ్ఞాతంలోకి పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.