మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్నికలలో నెగ్గడం కోసం ఫ్రీ బస్ అని హామీ ఇచ్చి మెట్రోను తీవ్ర నష్టాలపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర దుమారం రేగుతోంది.
నిజానికి ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ వలన మెట్రోలో లేడీ ప్యాసింజర్ల సంఖ్య తగ్గలేదు.లేడీ కంపార్ట్ మెంట్లు అన్ని కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. పైగా అదనంగా బోగీల సంఖ్య పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. అయినా , ప్రధాని మాత్రం ఫ్రీ బస్ జర్నీతో మెట్రోలోని లేడీస్ కంపార్ట్ మెంట్లు ఖాళీగా ఉంటున్నట్లు వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ పై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ,తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో అమలు అవుతోన్న ఈ స్కీమ్ అక్కడి మహిళలను ఆకట్టుకునేందుకే ఈ పథకం తీసుకొచ్చినా అది ఎంతోమందికి లబ్ది చేకూర్చింది. దీంతోపాటు కాంగ్రెస్ మహిళలకు ఇస్తోన్న హామీలపై బీజేపీకి భయం పట్టుకుందని.. మహిళల ఓటు బ్యాంక్ చేజారుతుందనే ఆందోళనతోనే ఈ స్కీమ్ పై ప్రధాని అక్కసు వెళ్లగక్కారని విపక్షాలు మండిపడుతున్నాయి.
మోడీ వ్యాఖ్యలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని, కేంద్రమంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పించవద్దా..? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని మహిళలు కోరుతుంటే ప్రధాని మాత్రం దీనిని రద్దు చేయాలంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.